TEJA NEWS

తల్లి స్వార్జిత ఆస్తి పై పిల్లలకు హక్కులు ఉండవు: హైకోర్టు

తల్లి స్వార్జిత ఆస్తి పై పిల్లలు హక్కులు కోరలేరని, ఇష్టమైన వారికి కానుకగా ఇచ్చే అధికారం ఆమెకు ఉందని హైకోర్టు తేల్చి చెప్పింది. తన తల్లి ఆస్తిలోని మూడోె వంతు వాటాను పెద్ద కుమారుడికి గిఫ్ట్ సెటిల్‌మెంట్ డీడ్ చేయడాన్ని సమర్ధిస్తూ సివిల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టులో చిన్న కుమారుడు పిటీషన్ దాఖలు చేశారు. వాదనలు విన్న ధర్మాసనం పై విధంగా తీర్పునిచ్చింది. ఆస్తి యజమానిగా తల్లి గిఫ్ట్‌డీడ్‌ ఇవ్వడాన్ని సమర్థిస్తూ తీర్పు వెలువరించింది.

Print Friendly, PDF & Email

TEJA NEWS