TEJA NEWS

స్వచ్చదనం – పచ్చదనంతో సంపూర్ణ ఆరోగ్యం ప్రత్యేక అధికారి,డిప్యూటీ కలెక్టర్ పి.రాంరెడ్డి

ఆరోగ్యం – పరిశుభ్రత పై లక్ష్మీ పల్లి లో విద్యార్థులకు అవగాహన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్వచ్చ దనం – పచ్చదనం కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని దేవరకద్ర మండల ప్రత్యేక అధికారి, డిప్యూటీ కలెక్టర్ పి.రాంరెడ్డి పిలుపు నిచ్చారు.స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమం పర్యవేక్షణలో భాగంగా దేవరకద్ర మండల అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రావు తో కలిసి గురువారం లక్ష్మీ పల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా లక్ష్మీ పల్లి ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలల ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆరోగ్యం పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. స్వచ్చదనం – పచ్చదనం – వనమహోత్సవం కార్యక్రమాలకు సంబంధించి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన నినాదాలతో కూడిన కర పత్రాలను ఆవిష్కరించారు. అనంతరం డిప్యూటీ కలెక్టర్ రాంరెడ్డి మాట్లాడుతూ స్వచ్చ దనం – పచ్చదనంతో ప్రతి ఒక్కరూ సంపూర్ణ ఆరోగ్య వంతులుగా మారుతారని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులు వ్యక్తి గత పరిశుభ్రతను విధిగా పాటించాలని సూచించారు. పరిసరాలను ,పాఠశాలను , గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటే ఎలాంటి రోగాలు దరి చేరవని అన్నారు. ముఖ్యంగా ఇళ్ల ముందు మురుకి నీరు నిలువ ఉo డకుండా చూసుకోవాలని సూచించారు. అపరిశుభ్రత కారణాల వల్ల దోమలు, ఈగల బెడద ఎక్కువ డెంగ్యూ, మలేరియా వ్యాధులతో పాటు అనేక అంటూ రోగాలు,సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉoటుందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పై దృష్టి సారించాలని కోరారు. ప్రధానంగా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలను కోరారు. కాగా లక్ష్మీ పల్లి పాఠశాల లోని పచ్చదనం పరిశుభ్రతపై, ప్రత్యేక అధికారి , డిప్యూటీ కలెక్టర్ రాం రెడ్డి సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు.

పరిశుభ్రత – పచ్చదనం పెంచాలి

  • యం పి డి ఓ శ్రీనివాస్ రావు
    స్వచ్చ దనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా యం పి డి ఓ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ గ్రామాల్లో పరిశుభ్రత,పచ్చదనం పెంచేందుకు ప్రజలందరు స్వచ్ఛందంగా ముందుకు రావాలని పిలుపు నిచ్చారు. పచ్చదనం,పరిశుభ్రతలతో ప్రజల ఆరోగ్యాలు బాగుంటాయని అన్నారు. అనంతరం గ్రామంలో క్రీడా మైదానంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఎ పి ఓ , పంచాయితీ కార్యదర్శి రాంచందర్, మాజీ సర్పంచ్ కృష్ణా రెడ్డి, జూనియర్ రెడ్ క్రాస్ సమన్వయ కర్త అశ్విని చంద్రశేఖర్, ప్రాథమిక, ఉన్నత పాఠశాలల హెచ్ ఎం లు కే కే శ్రీనివాస్, యం. ఎ.బాసిద్, ఉపాధ్యాయులు అస్రఖాద్రి, శంకర్, ఎ.చంద్ర శేఖర్,మదన్, కల్పన, విజయ లక్ష్మీ, సుజాత , ఫీల్డ్ అసిస్టెంట్ జగదీష్, ఆంగన్ వాడీ, ఆశా కార్యకర్తలు లక్ష్మీ, పాండమ్మ, నందిని, పరమేశ్వరి , గ్రామస్తులు వెంకటేశ్వర రెడ్డి, రాములు, సాయిలు, రమేష్, కొండన్న తదితరులు పాల్గొన్నారు…

TEJA NEWS