TEJA NEWS

సివిల్స్ అభ్యర్థులారా అన్నగా నేను అండగా ఉంటా : సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్:ఆగస్టు 27
రాజీవ్‌ గాంధీ సివిల్స్‌ అభయహస్తం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్‌ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నా రు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ..

ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు చేశామని, ఇంకో ముపై ఐదు వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నామని ఆయన తెలిపారు. ఉద్యోగ నియామకాల కోసం చిత్త శుద్ధి తో పని చేస్తున్నామని, ఆయన అన్నారు.

సివిల్స్ విద్యార్థులకు అతస్థైర్యం ఇవ్వడం కోసం మా ప్రయత్నమన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. కొందరికి లక్ష చిన్నది కావచ్చు.. కొంద రికి లక్ష ఎక్కువ కావచ్చు అని, కానీ మేము మీకు అండగా ఉన్నాం అని చెప్పడం కోసం మా ఆలోచన అని ఆయన వ్యాఖ్యానించారు.

మీరు మా కుటుంబ సభ్యు లు అని చెప్పే ప్రయత్నం మాది అని, చాలా కాలం సచివాలయం లేదని, సచివాలయం వచ్చాకా.. ఎవరికి అనుమతి లేద న్నారు. అలాంటి పరిస్థితి నుండి ఇది ప్రజలది అని నమ్మకం కలిగించే ప్రయ త్నం చేశామని ఆయన తెలిపారు.

అందుకే మిమ్మల్ని కూడా ఇక్కడికే రప్పించామని, ఇంటర్వ్యూలలో కూడా ఐఏఎస్ కి సెలక్ట్ అవ్వాల న్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.

అంతేకాకుండా..మన పిల్లలు ఎందుకు ఐఏఎస్ లుగా ఎందుకు ఎంపిక కాకూడదు అని మేము ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. పరీక్షల మీద దృష్టి పెట్టండి. తెలంగాణలో విద్య సర్టిఫికెట్ కోర్సులకు పరిమితం అవుతుంది.

పరిశ్రమలు పెట్టడానికి వచ్చే వాళ్లంతా .. వృత్తి నైపుణ్యం కలిగిన వాళ్ళ కోసం వెతుకు తున్నారు.విద్యార్దులకు.. కంపనీలకు గ్యాప్ కనిపి స్తుంది. అందుకే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు. వచ్చే ఏడాది నుండి స్పోర్ట్స్ యూనివర్సిటీ. గచ్చిబౌలి స్పోర్ట్ విలేజ్ పదేళ్లుగా నిరుపయోగంగా మారింది.

ప్రతి నియోజక వర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. ఈ ఏడాది బడ్జెట్ లో ఐదు వేల కోట్లు పెట్టాం.. 100 నియోజక వర్గాల్లో కట్టబోతున్నం. పది పదిహే ను రోజుల్లో vc ల నియా మకం. గతంలో పరీక్షలు పెట్టాలి అని ఆందోళన జరిగేది. ఇప్పుడు మేము పరీక్ష పెడుతుంటే..కొందరు వద్దు అని ఆందోళన చేయిస్తున్నారు.

కొందరు ఉద్దేశ పూర్వకంగా రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారు. గతంలో ఇలాగే రెచ్చగొట్టి విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకు న్నారు. వాళ్ళ త్యాగం మీద రాజకీయం చేశారు.

వాళ్ళ ఉద్యోగాలు పొగానే మళ్ళీ విద్యార్థుల రెచ్చగొడు తున్నారు. విద్యార్దులు ఎందు కు.. బావ బమ్మార్డు లు దుక్కలెక్క ఉన్నారు.. మీరు దీక్షలు చేయండి వాళ్లు వీళ్లు చేసే విద్యార్దు లు కుట్రలకు లొంగకండి. సివిల్స్ ఇంటర్వ్యూలకు కూడా ఆర్థిక సాయం చేస్తాం.

మా ప్రాధాన్యత రైతు లు..విశ్వ విద్యాలయం .. ఉద్యోగాలు. గత పాలకు లకు ప్రాధాన్యత ఇది కాదు.. భవనాలు…ఆస్తులు వారి ప్రాధాన్యత.. నల్గొండ జిల్లాలో ఎస్సైల ఎంపిక ఎక్కువ ఉంటుంది.

30 ఏండ్లు నుండి అక్కడ పోటీ ఎక్కువ. ప్రతి గ్రామం లో పోటీ పెరిగి SI లు అవుతున్నారు. సివిల్స్ కూడా అలాగే పోటీ పడాలి.
మెయిన్స్ కి వెళ్ళాలి.. మీకు ఏ సమస్య వస్తె.. మీకు అన్నగా నేను అండగా ఉంట’ అని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS