TEJA NEWS

పాలనలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు .. సోషల్ మీడియాలో ప్రశంసలు.

పాలనలో సీఎం రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. తనదైన మార్కు చూపిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా గత ప్రభుత్వాలు పట్టించుకోని సమస్యలను సీఎం రేవంత్ పరిష్కరిస్తున్నారని నెటిజన్లు సోషల్ మీడియాలో అభినందిస్తున్నారు. చెరువులను కబ్జా చేసి నిర్మించిన భవంతులను హైడ్రా ద్వారా కూల్చేస్తున్నారని చెబుతున్నారు.

పదేళ్ల బీర్ఎస్ పాలనలో చాలా చెరువులు కబ్జాలకు గురయ్యాయని.. బీఆర్ఎస్ నేతలే చాలామంది కజ్జాలకు పాల్పడ్డారని… ఇప్పుడు వాటిని హైడ్రా ద్వారా కూలుస్తూ విముక్తి కల్పిస్తున్నారంటూ కొనియాడుతున్నారు. ఇక యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్, గంజాయి ఆటకట్టిస్తున్నారని శభాష్ సీఎం అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక నాణ్యత లేని ఆహారం తయారు చేస్తున్న హోటళ్లపై ఫుడ్ సెప్టీ రైడ్లు చేస్తున్నారంటున్నారు.

అయితే రైతు రుణమాఫీ, ఇతర సమస్యలపై ప్రజల దృష్టిని మరల్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా నాటకానికి తెరలేపారని బీఆర్ఎస్ విమర్శిస్తోంది. చెరువుల స్థలాల్లో నిర్మించిన మంత్రులు, కాంగ్రెస్ నేతల ఇళ్లను, ఫామ్ హౌస్‌లను కూల్చేస్తారా? అని ఆ పార్టీ నేతలు నిలదీస్తున్నారు. ఇవాళ కూల్చిన నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లోనే 2015లో రేవంత్ రెడ్డి తన కూతురి ఎంగేజ్‌మెంట్ జరిపారని సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతూ గుర్తు చేస్తున్నారు.


TEJA NEWS