శని. జూలై 27th, 2024

ఢిల్లీ చేరుకున్న రేవంత్.. కాంగ్రెస్ సీఈసీలో పాల్గొననున్న సీఎం

TEJA NEWS

ఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం మధ్యాహ్నం ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీఈసీ సభ్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరుకానున్నారు. తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న లోక్‌సభ స్థానాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది.

ఇప్పటికే 2 దఫాల్లో 9 మందిని ఏఐసీసీ ప్రకటించింది. 8 స్థానాలు ఖమ్మం, భువనగిరి, మెదక్, కరీంనగర్, నిజామాబాద్, హైదరాబాద్, ఆదిలాబాద్, వరంగల్‌పై ఇవాళ చర్చించి సీఈసీ నిర్ణయం తీసుకోనుంది. 8 స్థానాల్లో 6 స్థానాలపై ఒక అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. మూడు స్థానాలపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఖమ్మము, భువనగిరి, నిజామాబాద్ స్థానాలపై కాంగ్రెస్ నేతలు కుస్తీ పడుతున్నారు.

రెఫరెండమే!

ఖమ్మం నుంచి పొంగులేటి ప్రసాద్ రెడ్డి, మల్లు నందిని, తుమ్మల యుగంధర్, రాజేంద్ర ప్రసాద్‌లు టికెట్ ఆశిస్తున్నారు. భువనగిరి నుంచి టికెట్ కోసం చామల కిరణ్, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, గుత్తా అమిత్, కోమటి రెడ్డి ఫ్యామిలీ ప్రయత్నాలు చేస్తోంది. నిజామబాద్ టికెట్ బరిలో జీవన్ రెడ్డి, సునీల్ రెడ్డి, అనిత రెడ్డి ఉన్నారు.

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు

”ఈ రోజు రాత్రికి అన్ని స్థానాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అభ్యర్థుల ప్రకటన తర్వాత పూర్తిగా గ్రౌండ్‌లోనే హస్తం శ్రేణులు ఉండనున్నాయి. పార్లమెంట్ స్థానాల వారీగా సమీక్షలు చేస్తూ రేవంత్ దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ స్ట్రాటజీపై ముఖ్య నేతలతో చర్చించనున్నారు. టార్గెట్ 14 రీచ్ అవ్వాల్సిందేనని రేవంత్ కాంగ్రెస్ నేతలకు స్పష్టం చేస్తున్నారు.. కేపి

Print Friendly, PDF & Email

TEJA NEWS

Related Post

You cannot copy content of this page