నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన కమిషనర్ మౌర్య
తిరుపతి నగరపాలక సంస్థ:
నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్. మౌర్య ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. నగరంలోని గురువారెడ్డి సమాధుల సమీపంలో గల మస్టర్ గది వద్ద ముఖ ఆధారిత హాజరును పరిశీలించారు. ఆలస్యంగా విధులకు హాజరయ్యే వారిపై చర్యలు తీసుకోవాలని హెల్త్ ఆఫీసర్ ను ఆదేశించారు. అనంతరం నగరంలోని వైఎస్ఆర్ మార్గం, లక్ష్మీపురం కూడలి, ఎయిర్ బైపాస్ రోడ్డు, ఎం.ఆర్. పల్లి పోలీస్ స్టేషన్ తదితర ప్రాంతాల్లో పారిశుద్య పనులను పరిశీలించారు. నగరంలో ఎక్కడా చెత్త వేయకుండా చూడాలని అన్నారు. నగరంలో రోడ్లపైన, కాలువల్లో చెత్త వేసేవారిని గుర్తించి అపరాధ రుసుము విధించాలని అన్నారు. ఖాళీ స్థలాల్లో ఉన్న చెత్త తొలగించాలని యజమానులకు నోటీసులు ఇచ్చినా తొలగించని వారిని మరోమారు హెచ్చరించాలని అన్నారు. అప్పటికి వారు స్పందించకపోతే మీరే తొలగించి అపరాధ రుసుము విధించి, వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. మురుగు కాలువల్లో వ్యర్ధాల తొలగింపు పనులు త్వర్గా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో ఎక్కడైనా అవకతవకలకు పాల్పడితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కమిషనర్ వెంట సువరింటెండెంట్ ఇంజినీర్ మోహన్, మునిసిపల్ ఇంజినీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, డి.ఈ. సంజయ్ కుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, డిసిపి శ్రీనివాసులు రెడ్డి, శానిటరీ సూపర్ వైజర్లు చెంచయ్య, సుమతి, టౌన్ ప్లానింగ్ సెక్రటరీ లు, తదితరులు ఉన్నారు.
,,,,,,,,,
నగరంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన కమిషనర్ మౌర్య
Related Posts
ఇకనుంచి 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు: సీఎం చంద్రబాబు
TEJA NEWS ఇకనుంచి 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు: సీఎం చంద్రబాబు ఏపీలో పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త అందించారు. పెన్షన్ మొత్తాన్ని 3 నెలలకోసారి తీసుకోవచ్చని వెల్లడించారు. పెన్షన్ ఎవరు ఆపినా వెంటనే నిలదీయాలని…
డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామ కృష్ణంరాజు
TEJA NEWS డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామ కృష్ణంరాజును అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాసన సభ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామ కృష్ణం రాజు ని తోడ్కొని వెళ్లి స్పీకర్ స్థానం లో కూర్చోబెట్టిన ముఖ్యమంత్రి…