TEJA NEWS

కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మూడో రోజు కొనసాగింది. హైదరాబాదు నగరం శివారు ప్రాంతమైన దుండిగల్ గండి మైసమ్మ మండల పరిధిలోని చర్చిగాగిల్లాపూర్ ప్రాంతంలో ప్రొఫెసర్ జయశంకర్ ప్రాంగణంలో మూడోరోజు ఆమరణ నిరాహారదీక్ష కొనసాగిన హిందూ బీసీ మహాసభ అధ్యక్షులు బత్తుల సిద్దేశ్వర పటేల్, బిసి ఆజాద్ యూత్ ఫెడరేషన్ అధ్యక్షులు జక్కని సంజయ్ నేత ఈ ఆమరణ దీక్షను చేస్తున్నారు. మంగళవారం నాడు ఈ దీక్ష శిబిరాన్ని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే ప్రభుత్వం కుల గణన చేపట్టాలని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తెలంగాణ బీసీ సమాజం మీరు చేస్తున్న దీక్షకు మద్దతుగా ముందుకు వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రతి కుల సంఘం, ప్రతి బీసీ సంఘం, ప్రతి బీసీ నాయకుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నరని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ డిమాండ్ నెరవేర్చని పక్షంలో రాష్ట్ర మొత్తం భగ్గుమంటుందని బిసి విద్యార్థులు బీసీలకు మేధావులు బిసి ప్రజాస్వామ్యవాదులు అందరు నిరసనలకు చేస్తారని ఆయన పిలుపునిచ్చారు. బీసీ జన సభ అధ్యక్షులు రాజారాం యాదవ్ మాట్లాడుతూ తెలంగాణలో బీసీ పోరాట యోధులు ఉన్నారని నేడు తెలంగాణ అమరవీరుల వారసత్వాన్ని పునికిపించుకొని బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం ఉధృతం చేస్తారని తెలిపారు. తాత్సారం చేస్తే తగు బుద్ధి చెప్తామని ఆయన హెచ్చరించారు.

సోషల్ జస్టిస్ పార్టీ అధ్యక్షులు చామకూర రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ద్వంద వైఖరి విడనాడాలని చెప్పారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ప్రక్రియను చేపట్టాలని హెచ్చరించారు లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీకి బీసీలు తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. ఈ దీక్షకు సంఘీభావం తెలిపిన వారిలో సోషల్ జస్టిస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ కె వి గౌడ్, బ్లూ ఇండియా పార్టీ అధ్యక్షుడు బొంగు ప్రసాద్ గౌడ్, వర్కర్స్ పార్టీ అధ్యక్షులు రాయబండి పాండురంగా చారి, బీసీ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షులు కోట్ల వాసుదేవ్ పటేల్, హిందూ బిసి ఆజాది సంగ్ అధ్యక్షులు దేశం మహేష్ గౌడ్, హిందూ బిసి మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు దుబ్బకోటి ఆంజనేయులు ముదిరాజ్, జనరల్ సెక్రెటరీ చింతలగారి వెంకటస్వామి పటేల్, హిందూ బిసి మహాసభ నాయకులు కుంటి విజయకుమార్ మాదిగ, కులగనన సాధన సమితి అధ్యక్షులు డాక్టర్ అవ్వరు వేణు కుమార్ నేత, జీడి వెంకటేష్, మేకల కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS