TEJA NEWS

స్వచ్ఛదనం – పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్”

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చదనం – పచ్చదనం కార్యక్రమంలో భాగంగా ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని శంశిగుడాలోని వార్డ్ ఆఫీస్ పరిసర ప్రాంతాలలో నాలాలు మరియు పరిసరాలను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ డీసీ ఎచ్.కృష్ణయ్య తో కలిసి శుభ్రం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమం ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని అన్నారు. ఆగస్టు 5 వ తేదీ నుండి 9 వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది అని, మొదటి రోజు వ్యర్థాల తొలగింపు రెండవ రోజు దోమల నివారణ, మూడవ రోజు చెరువుల సంరక్షణ, నాల్గవ రోజు నాలల క్లినింగ్, ఐదవ రోజు వన మహోత్సవం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అని అన్నారు.

కాలనీ లో పేరుకుపోయిన వ్యర్ధాలను తొలగించి, దోమల నిర్వహణకు చర్యలు తీసుంటామని, చెరువులను సంరక్షణ కార్యక్రమలు, నాలల క్లినింగ్, వన మహోత్సవం వంటి కార్యక్రమాలు చేపట్టి కాలనీలను సుందర శోభితాలుగా తీర్చిదిదిద్దుతాం అని కార్పొరేటర్ గారు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జి.ఎచ్.ఎం.సి అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, ఆర్.పి లు, సమాఖ్య లీడర్లు, మహిళా సంఘాల సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS