TEJA NEWS

చట్టాలపై అవగాహన కలిగిస్తున్న డిఫెన్స్ లీగల్ ఎడ్ కౌన్సిల్ జి. ఉత్తరయ్య
వనపర్తి
జిల్లాలోని పెద్దమందడి మండలం, జగత్తుపల్లి గ్రామం లో వనపర్తి జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో లీగల్ ఏడ్ డిఫెన్స్ కౌన్సిల్ జి. ఉత్తరయ్య మాట్లాడుతూ కుటుంబ అవసరాలకు అప్పుగా తీసుకునేటప్పుడు ఇచ్చేటప్పుడు తగిన నిబంధనలు పాటించాలని ప్రామిసరీ నోటు లేదా చెక్కు లాంటివి తీసుకోవాలని వాటిపైన తేదీ సంతకాలు లేని పక్షంలో చట్టపరమైన ఇబ్బందులు ఎదురవుతాయని తెలియజేశారు. వీటి కాలపరిమితి మూడు సంవత్సరాలు ఉంటుందని తెలియజేశారు. మరియు మోటార్ వెహికల్స్ చట్టాలపై అవగాహన కల్పించడం జరిగింది.

తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదని హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, వాహనానికి సంబంధించిన కాగితాలు లేనిపక్షంలో వారి పై క్రిమినల్ కేసులు అవుతాయి. భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగాలు రావని తెలియజేశారు. అసిస్టెంట్ లీగలేడు డిఫెన్స్ కౌన్సిల్ ఎం శ్రీదేవి మాట్లాడుతూ 18 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు బాల్యవివాహాలు చేయకూడదని ఎవరైనా ఇటువంటి బాల్య వివాహాలను ప్రోత్సహించినచో ఇరువురి తల్లిదండ్రులతో పాటు పెళ్లి చేసిన పూజారి, ఫోటోగ్రాఫర్, పెండ్లికి హాజరైన పెద్దమనుషుల పై చట్ట పరంగా చర్యలు తీసుకోబడతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మదిలేటి గ్రామ పెద్దలు లోకదాలత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS