TEJA NEWS

ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ప్రాధాన్యత క్రమంలో చేపడతాం.
-నగరంలోని 50వ డివిజన్ భాస్కర్ నగర్ లో పర్యటించి ఎమ్మేల్యే ఆదిరెడ్డి వాసు
రాజమహేంద్రవరం :
నగరంలో ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రాధాన్యత క్రమంలో చేపట్టి అమలు చేయడం జరుగుతుందని నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) పేర్కొన్నారు. మంగళవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ స్థానిక నాయకులు అధికారులతో కలిసి 50వ డివిజన్ భాస్కర్ నగర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ 50వ వార్డు భాస్కర్ నగర్ లో పర్యటించి ప్రజలతో ముఖాముఖి మాట్లాడి పలు సమస్యలను అడిగి తెలుసుకోవడం జరిగిందన్నారు. ముఖ్యంగా అంతర్గత రహదారులు, శానిటేషన్ , త్రాగునీరు, కల్వర్టుల నిర్మాణం, డ్రైనేజీ వంటి పలు సమస్యలు తన దృష్టికి తీసుకొచ్చారన్నారు. ఈ అంశంపై నగరపాలక సంస్థ అధికారులతో సమీక్షించడం జరిగిందని త్వరితగతిన ప్రాధాన్యత క్రమంలో అంతర్గత రహదారులు, డ్రైనేజీ, కల్వర్టుల నిర్మాణం పనులను చేపడతామన్నారు.

ఇందుకు అవసరమయ్యే ప్రతిపాదన సిద్ధం చేయాలని నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ అధికారులకు సూచించడం జరిగిందని పేర్కొన్నారు. త్రాగునీటి సరఫరాకు సంబంధించి ఎక్కడ ఎటువంటి లోపాలు ఉన్నా తన దృష్టికి తెస్తే వెంటనే మరమ్మతులు చేపట్టి త్రాగునీటి సమస్యను పరిష్కరించడం జరుగుతుందన్నారు. అదేవిధంగా
నగరంలో పారిశుధ్య సమస్య లేకుండా మెరుగైన శానిటేషన్ అందించే దిశగా చర్యలు చేపట్టాలని నగరపాలక సంస్థ అధికారులు సూచించామన్నారు. అలాగే భాస్కర్ నగర్ లో వున్న సొసైటీ స్థలాల సమస్యలపై చర్చించి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపడతామన్నారు. నగర ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత ఎమ్మెల్యేగా నేను తీసుకుంటానన్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ, అభివృద్ధికి కట్టుబడి ఉన్నదని తెలియజేశారు. పచ్చదనం పరిశుభ్రత లో భాగంగా త్వరలో ఈ ప్రాంతంలో ఒక పార్క్ కూడా నిర్మించే కార్యక్రమం చేపట్టామని ఎమ్మెల్యే తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు కె.నవీన్ కుమార్, నగరపాలక సంస్థ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS