TEJA NEWS

అభిమాన నాయకుని జన్మదినం సందర్బంగా విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ నాయకులు.

సూర్యాపేట మున్సిపాలిటీ 11వ వార్డ్ రాయినిగూడెం ప్రాథమిక పాఠశాలలో మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని కాంగ్రెస్ పార్టీ సభ్యుల ఆద్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున హాజరై ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి నోట్ పుస్తకాలు పంపించేశారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎలగబోయిన మధు యాదవ్ మాట్లాడుతూ నిత్యం ప్రజాసేవలో అంటూ, ప్రజల కష్ట సుఖాలను చూసుకుంటూ, ప్రజాశ్రేయస్సుకై పాటుపడే నాయకుడు రాంరెడ్డి దామోదర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను విద్యార్థులతో కలిసి నిర్వహించుకోవడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు. దామోదర్ రెడ్డి సాయం అంటూ వచ్చినవారికి వెన్నంటి ఉండే నాయకుడని ఆయన అన్నారు. అభిమాన నాయకుణ్ణి కలవడానికి నిత్యం వందలాదిగా వస్తున్న అభిమానులకు, నాయకులకు శాలువాలు, పూల దండలు, బొకేలు తీసుకురావద్దని పేద,మధ్యతరగతి విద్యార్థులకు ఉపయోగపడే పుస్తకాలు పెన్నులు తీసుకురావాలని కోరిన గొప్ప వ్యక్తి అని కీర్తించారు. ఇలాంటి నాయకులు ప్రతి చోటా ఉండాలని అన్నారు. తమ నాయకుడు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని భగవంతున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డ్ పార్టీ ఇంచార్జ్ ఎల్గూరి వెంకటేశం, ఎల్గూరి వీరయ్య గౌడ్, కొప్పుల రాంరెడ్డి, నంద్యాల ప్రతాపరెడ్డ, నంద్యాల బిక్షం రెడ్డి, శ్రీనివాసరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS