సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కలకు పంపిణీ
ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ పలు ప్రైవేట్ హాస్పిటల్ వైద్యం చేయించుకున్న వారికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సిఫార్సుతో మంజూరు అయిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వరరావు, మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు వనం చెన్నప్పగార్ల చేతుల మీదుగా నేరడ గ్రామానికి చెందిన లబ్ధిదారులకు చెక్కులను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో… మహిళా మండల అధ్యక్షురాలు తోటకూరి ప్రగతి, మాజీ సర్పంచ్ గొర్రె ముచ్చు ఈశ్వరమ్మ, మండల మైనార్టీ నాయకులు ఎస్ కే సుభాని, పెరిక నందు, తదితరులు పాల్గొన్నారు.