TEJA NEWS

ప్రజలకు ఇబ్బంది కలుగకుండా డాక్టర్లు వైద్య సేవలు అందించాలి:
ప్రభుత్వ ఆస్పత్రులలో డాక్టర్లు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి
జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్

జగిత్యాల జిల్లా : ప్రజలకు ఇబ్బంది కలుగకుండా డాక్టర్లు వైద్య సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు.
కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హల్ లో డాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మొత్తం GGH, MCH లో ఎంత మంది డాక్టర్లు ఉన్నారు, డిప్యుటేషన్ పై ఎంత మంది డాక్టర్లు ఉన్నారు, వైద్యం చేసే డాక్టర్ల కు బదులుగా వారు సెలవులో ఉన్నప్పుడు మెడికల్ కాలేజీలో ఉన్న ప్రొఫెసర్ లను ఎలా కేటాయిస్తారంటూ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఆసుపత్రిలో డాక్టర్లు లేకుండా నర్సులు ఎలా ట్రీట్ మెంట్ ఇస్తారు అని అడిగారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా సెలవులో వెళ్లిన డాక్టర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. వాళ్ళకి షిఫ్ట్స్ ఉన్నాయా, రోస్టర్ ఉందా , మార్నింగ్ షిఫ్ట్ చేసిన వెళ్లిన డాక్టర్ మళ్ళీ వచ్చేది మీకు ఎలా తెలుస్తుంది అని కలెక్టర్ ప్రశ్నించారు. బయోమెట్రిక్ లో వేలిముద్రలు వేస్తే డాక్టర్లు వస్తున్నారా లేదా అని తెలుస్తుందని, ఆబ్సెంట్ లో ఉన్నారా లేదా అబ్సకాండింగ్ లో ఉన్నారా మొత్తం సమాచారం తెలుస్తుందని పేర్కొన్నారు. వాళ్ళు ఎటువంటి వైద్య సేవలు అందిస్తారని అడిగి తెలుసుకున్నారు. MCH కు సంబంధించి వాట్సాప్ గ్రూప్ ఉందని ఏ రోజు కు సంబంధించి ఆ రోజు డాక్టర్ల షెడ్యూల్ గ్రూప్ లో వస్తుందని దాని ప్రకారం డ్యూటీలో ఉన్నది లేనిది చెక్ చేస్తామని డాక్టర్లు వివరించారు. అదే విధంగా కంటిన్యూ గా ఆబ్సెంట్ వస్తే దాదాపు 6 నెలలుగా సెలవులో ఉంటే వారికి జీతాలు చెల్లిస్తారా అని కలెక్టర్ అడిగారు. లీవ్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఇబ్బంది పడకుండా డాక్టర్లు అందుబాటులో ఉండే విధంగా ఎలా ఆబ్సెంట్ ని కంట్రోల్ చేయాలి అని పేర్కొన్నారు. సమాచారం ఇవ్వకుండా అందుబాటులో లేని డాక్టర్లను సస్పెండ్ చేయడం పెద్ద విషయం కాదని తెలిపారు. ఒక వారం రోజులు ఆబ్సెంట్ ఉంటే మెమో ఇచ్చి ఆబ్సెంట్ ఉన్న రోజు జీతం కట్ చేయాలని సూచించారు. అనంతరం ఆసుపత్రికి కావలసిన సదుపాయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. డెలివరీ అయిన బాలింతలను వార్డుకు తీసుకువెళ్లాలంటే ర్యాంపు మాత్రమే ఉందని లిఫ్ట్ లేదని దానివల్ల ఇబ్బందులు పడుతున్నారని వైద్యులు తెలిపారు. అలాగే దగ్గరలో ఒక బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయాలని కోరారు. GGH లో ఆక్సీజన్ అవసరం ఉందని, ప్రస్తుతం ఆక్సిజన్ లు రిపేర్ లో ఉన్నాయని, మరియు మాతా శిశు హాస్పిటల్ ఆక్సిజన్ ప్లాంట్ సంక్షన్ అయింది, అది ఇష్టాలేషన్ ప్రాసెస్ లో ఉందని తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి యం. డి.సమీయొద్దీన్, వైద్యాధికారులు, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS