TEJA NEWS

ఎండి రాజ్ కి డా. బి. ఆర్. అంబేద్కర్ జాతీయ సేవా రత్న అవార్డు ..

విజయవాడ అమరావతి నడిబొడ్డున పౌర గ్రంధాలయంలో మదర్ సర్వీస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో రెండవ వార్షికోత్సవం సందర్భంగా వివిధ సాంస్కృతిక, సేవా కార్యక్రమంలు చేసిన వారిని గుర్తించి నాలుగైదు రాష్ట్రాలు వారికి అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం పరవాడ మండలం ఈ. బోనంగి గ్రామానికి చెందిన ఎండి రాజ్ కి ప్రఖ్యాత డా. బి. ఆర్. అంబేద్కర్ జాతీయ సేవా రత్న అవార్డు అందజేశారు. ఈ సందర్బంగా ఎండి రాజ్ మాట్లాడుతూ ఈ అవార్డు ఇచ్చిన మదర్ సర్వీస్ సొసైటీ వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తు, భవిష్యత్ లో మరిన్ని సేవా కార్యక్రమంలు చేపడతానని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడ సిటీ ఎమ్మెల్యేలు, సినీ ఆర్టిస్టులు, నేషనల్ ఎన్జీవో ప్రతినిధులు, టీవీ ఆర్టిస్టులు, రియల్ ఎస్టేట్ సంస్థ ప్రతినిధులు సింగర్లు తదితరులు పాల్గొన్నారు…

Print Friendly, PDF & Email

TEJA NEWS