TEJA NEWS

రాజభవనానికి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తా……. ఎమ్మెల్యే మెగా రెడ్డి

వనపర్తి :
చారిత్రక చరిత కలిగిన వనపర్తి రాజావారి ప్యాలెస్ ను ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రాజా భవనాన్ని కి పూర్వపు వైభవాన్ని తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని స్థానిక ఎమ్మెల్యే తుడి మెగా రెడ్డి పేర్కొన్నారు ఆయన రోడ్ల
భవనాల శాఖ అధికారుల, మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులతో కలిసి వర్షపు నీరు నిలిచిన రాజభవనాన్ని సందర్శించారుఅనంతరం ఆయన మాట్లాడుతూ రాజా ప్యాలెస్ పాలిటెక్నిక్ కళాశాలలో గత పాలకుల అవగాహన రాహిత్యతో సీసీ రోడ్ల నిర్మాణాల వల్లే వర్షపు నీరు పూర్తిగా రాజభవనంలోకి చేరి అసలు భవనానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని కాపాడుకునేందుకు అవసరమైతే నీటిపారుదల శాఖ డ్యామ్ సేఫ్టీ అధికారి వనపర్తి వాస్తవ్యులైన శ్రీనివాస్ రెడ్డి సహకారాన్ని తీసుకుంటామని అలాగే పట్టణ వాసులు జిల్లా వాస్తవ్యులు మేధావులు విజ్ఞులు పెద్దలు సైతం తమ వంతు సహకారాన్ని ఇవ్వాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్ పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు ఎమ్మెల్యే వెంట ఉన్నారు


TEJA NEWS