TEJA NEWS

సబ్బవరం రెవెన్యూ అధికారులపై రైతులు ఆందోళన…


సబ్బవరం ఇరువాడ గ్రామంలో జిరాయితి భూమిలో రైతుల పొలాలకు వెళ్లేం దుకు నిర్మించుకున్న రోడ్డును రాజకీయ కక్షతో ధ్వంసం చేసిన వ్యక్తులతో పాటు రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దళిత సంఘం నేత పాల్తేటి పెంటా రావు డిమాండ్ చేశారు. మండలంలోని ఇరువాడ గ్రామం లో జాతీయ రహదారిని ఆనుకొని రైతుల పొలాల్లోకి వెళ్లే రోడ్డును తవ్వడాన్ని నిరసిస్తూ ఆయన రైతు లతో కలిసి ఆందోళన చేపట్టారు. ఇరువాడ గ్రామంలో సర్వే నెంబర్ 108లో రైతుల పొలాల్లోకి వెళ్లే రోడ్డును ఇదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆరి, వీఆర్వోలు పొక్లెయిన్ 5 సాయంతో ధ్వంసం చేయడంతో రైతులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పూర్వం నుంచి రోడ్డు ఉండడంతోనే జాతీయ రహదారి విస్తరణ సమయం లో రోడ్డుకు జాతీయ రహదారి నుంచి డైవర్షన్ ఏర్పాటు చేశారన్నారు.

స్థానికంగా ఉండే నేత ఒత్తిడితోనే రెవెన్యూ సిబ్బంది రోడ్డు తవ్వేశారని ఆరోపించారు. రైతులను ఇబ్బందులకు గురిచేసేందుకు ఇలాంటి చర్యలకు పాల్ప డిన వ్యక్తితో పాటు రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకో వాలని లేదంటే తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళ నకు దిగుతామని హెచ్చరించారు. తాతారావు అనే రైతు మాట్లాడుతూ గ్రామ రైతులంతా 50 ఏళ్లగా ఇక్కడ పొలాలు సాగుచేసుకొంటూ జీవనం సాగిస్తున్నామ న్నారు.స్థానిక ఎమ్మెల్యే పేరు అడ్డుపెట్టుకొని ఆ వ్యక్తి వివా దాలకు దిగుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు


TEJA NEWS