TEJA NEWS

ప్రశాంతమైన వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవాలి
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్
రాజమహేంద్రవరం, :
వినాయక చవితి ఉత్సవాలను ప్రశాంతమైన వాతావరణంలో నిర్వహించుకోవాలని, ఎటువంటి వివాదాలకు తావు ఇవ్వకూడదని తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ సూచించారు..వినాయక ఉత్సవాలకు సంబంధించి కొన్ని ముఖ్య విషయాలు వెల్లడించారు..జిల్లాలో విగ్రహాలు పెట్టుకుని పందిళ్లు, మండపాలు ఏర్పాటు చేసుకునేవారు పోలీసు అనుమతి తీసుకోవాలన్నారు. ప్రశాంతమైన వాతావరణంలో అల్లర్లకు, ఘర్షణలకు తావు లేకుండా గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రజలు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని తెలిపారు. సాంస్కృతిక కార్య్రమాల పేరిట అశ్లీల నృత్యాలు, రికార్డింగ్ డ్యాన్సులు వంటివి జరిపినట్లయితే కారకులపై తగిన చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. పోలీస్, రెవెన్యూ శాఖల వారి ద్వారా ఏర్పాటు చేసిన సింగిల్ విండో సిస్టం ద్వారా అర్బన్ పరిధిలో మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ నుంచి, రూరల్ పరిధిలో వారు తహసిల్దార్ వద్ద నుండి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. మండపం చుట్టుపక్కల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, రాత్రి సమయాలలో కమిటీ సభ్యులు కచ్చితంగా మండపాలలో నిద్రించాలని అన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS