కొండకల్ లో ఫ్రైడే డ్రై డే కార్యక్రమం
శంకరపల్లి : కొండకల్ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎల్లయ్య శుక్రవారం ఫ్రైడే డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. స్వచ్ఛదనం -పచ్చదనం కార్యక్రమం లో బాగంగ నాలుగవ రోజు గ్రామం లో ఉన్న ప్రతి ఇంటికి వెళ్లి తనికి చేసి నీరు నిలిచిన తొట్టి లను , రోడ్ పక్కన మురిగిపోయిన వ్యర్ధ పదార్థాలను ,కుళ్లిపోయిన వస్తువుల నివారణను చేపట్టారు. అనంతరం ఎల్లయ్య మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యమే మహాభాగ్యం అంటూ ఎవరు మలేరియా , డెంగ్యు మరియు వివిధ వైదులకి బానిసలు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటునాము అని అన్నారు.అనంతరం మొక్కలను నాటారు.ఈ కార్యక్రమం లో ఎపిఒ భీమయ్య ,సిసి సుధాకర్ ,పంచాయతీ సెక్రటరీ ఎల్లయ్య ,మహిళా సంఘ అధ్యక్షులు,సెక్రటరీ సభ్యులు మరియు పంచాయతీ సభ్యులు పాల్గొన్నారు.