వ్యక్తిగత కారణాలతోనే గద్వాల్ సిఐ లీవ్ పై వెళ్ళారు, ఇందులో ఎలాంటి రాజకీయ వత్తిళ్లు లేవు – డి.ఎస్పి సత్యనారాయణ.
గద్వాల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న బీమ్ కుమార్ వ్యక్తిగత కారణాలతోనే లివ్ పై వెళ్లారని, లీవ్ లో వెళ్ళడానికి ఏలాంటి రాజకీయ వత్తిళ్లు లేవని డి.ఎస్పి సత్యనారాయణ మీడియా కు ఒక ప్రకటన ద్వారా తెలిపారు.
గద్వాల్ సిఐ సోదరుడికి పెరాలసిస్ స్ట్రోక్ రావడం వల్ల కర్నూల్ లోని ఒక హాస్పటల్ నందు చికిత్స పొందుతున్నారని అందుకు సి ఐ 3 రోజుల లీవ్ పై వెళ్ళడం జరిగిందనీ, అందుకు ఏలాంటి రాజకీయ వత్తిళ్లు గానీ ,రాజకీయ కారణాలు గాని లేవని జిల్లా డి .ఎస్పి మీడియాకు వివరణ ఇవ్వడం జరిగింది .