TEJA NEWS

రాజ్యాధికార సాధనే లక్ష్యంగా వికలాంగుల ఉద్యమాన్ని ఉదృతం చేస్తాం: గిద్దె రాజేష్

సూర్యాపేట జిల్లా ప్రతినిధి: ఢిల్లీలో ఎర్రకోటపై తెలంగాణలో గోల్కొండ కోటపై వికలాంగుడే జాతీయ జెండా ఎగరవేసే రోజు వచ్చేంతవరకు దేశంలో రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలపై రాజీలేని పోరాటం కొనసాగిస్తామని రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు.
రాజ్యాధికార సాధనే లక్ష్యంగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు. సూర్యాపేట జిల్లా దురాజ్పల్లి లో నిర్వహించిన సంఘం ఆరవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ ఇటీవల అనారోగ్యంతో మరణించిన తన తల్లి సంఘం జాతీయ అధ్యక్షురాలు గిద్దె భాగ్యమ్మ మృతి పట్ల సంఘం నేతలతో కలిసి మౌనం పాటించి ఘనంగా నివాళులర్పించారు అనంతరం సంఘం జెండాను ఆవిష్కరించి సంఘం నేతలు ఏర్పాటు చేసిన కేకును కట్ చేసి పలువురు నిరుపేదలకు పండ్లు పంపిణీ చేసి మొక్కలు నాటిన అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడిన భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ 78 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగుల సమాజానికి రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు దేశంలో రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు నేటికీ ముందుకు రాకపోవడం దురదృష్టకరమని తన తల్లి గిద్దె భాగ్యమ్మ స్ఫూర్తితో దేశంలో రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలపై రాజ్యాధికార సాధనే లక్ష్యంగా ఉద్యమాన్ని ఉధృతం చేసి దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై తెలంగాణాలో గోల్కొండ కోట పై వికలాంగుడే జాతీయ జెండా ఎగురవేసే రోజు వచ్చేంతవరకు దేశంలో రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలపై రాజీలేని పోరాటం

కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు మీనమేషాలు లెక్కించడం దురదృష్టకరమని తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలు అన్ని నెరవేర్చాలని ముఖ్యంగా వికలాంగుల సంక్షేమ శాఖను మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి వేరుచేసి ప్రత్యేక శాఖగా ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారులను నియమించాలని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలని రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వికలాంగుల బ్యాక్లాగ్ ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని గత కెసిఆర్ ప్రభుత్వం తీసుకు వచ్చిన దళిత బంధు పథకం మాదిరిగానే 15 లక్షలతో వికలాంగుల బంధు పథకాన్ని తీసుకువచ్చి ఆసరా పింఛన్ వచ్చే ప్రతి వికలాంగునికి పథకాన్ని వర్తింపజేసి చేయూతను ఇవ్వాలని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టబోయే గృహలక్ష్మి పథకంలోనూ వికలాంగులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించి ఆసరా పింఛను వచ్చే ప్రతి వికలాంగునికి వివాహంతో సంబంధం లేకుండా డబల్ బెడ్ రూమ్ ఇల్లు నిర్మించి ఇవ్వాలని ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే వికలాంగుల పింఛను 6000 కు పెంచాలని పార్లమెంటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థలు ఎన్నికల్లో ప్రత్యేక రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన నూతన జిల్లా కేంద్రాల్లో వెంటనే వికలాంగుల హాస్టల్ నిర్మించాలని రాష్ట్ర రాజధాని కేంద్రంలో అన్ని కుల సంఘాలకు నిర్మించిన మాదిరిగానే వికలాంగులకు వికలాంగుల భవనం నిర్మించడంతోపాటు అన్ని జిల్లా కేంద్రాల్లోనూ వికలాంగులకు భవనాలు నిర్మించాలని దేశ ప్రధాని మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రవేట్ వైద్యశాలలో వికలాంగులకు వికలాంగుల కుటుంబాలకు ఉచిత వైద్యం అందించేందుకు కృషి చేయాలని,

రాష్ట్రంలో దేశంలో ఉన్న అన్ని ప్రభుత్వ ప్రవేట్ పాఠశాలల్లో వికలాంగులకు వారి పిల్లలకు ఉచిత విద్యను అందించాలని వికలాంగుల రక్షణ నిమిత్తం 2016 లో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016 ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమర్థవంతంగా అమలు చేయాలని వికలాంగుల మహిళలపై అత్యాచారం చేసి హత్యలు చేసే వ్యక్తులను ఎన్కౌంటర్ చేసేలా వికలాంగుల మహిళలకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని గత ప్రభుత్వం తీసుకు వచ్చిన నూతన పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించి గ్రామపంచాయతీలో వికలాంగులకు కో ఆప్షన్ సభ్యులుగా అవకాశం కల్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండ్ చేసిన ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగులకు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రాకుంటే తన తల్లి గిద్దె భాగ్యమ్మ స్ఫూర్తితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో వేలాదిమంది వికలాంగులతో కలిసి త్వరలో ఆమరణ దీక్షకు దిగుతానని వెల్లడించారు సంఘం జిల్లా అధ్యక్షుడు కుర్ర గోపి యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరి ఈదయ్య బాబు సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు గోగుల శేఖర్ రెడ్డి సంఘం జిల్లా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ జంజీరాల సుధాకర్ సంఘం రాష్ట్ర నాయకులు గుణగంటి వెంకటేశ్వర్లు గౌడ్ సంఘం జిల్లా సీనియర్ ఉపాధ్యక్షులు కొండ సైదులు యాదవ్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మున్న మధు యాదవ్ జిల్లా మహిళా నాయకురాలు పైడి వీరమ్మ జిల్లా నాయకులు మంచాల వెంకన్న కట్టకోల ఎల్లయ్య గౌడ్ ఆత్మకూరు మండల నాయకులు ఆరూరి బాబు బండ నాగరాజు కోడెల ఉప్పయ్య కలమ్మ తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS