TEJA NEWS

ఆలయ కమిటీ సభ్యుల సంకల్పానికి అమ్మవారి అనుగ్రహం తోడైతేనే దేవాలయ నిర్మాణం సాధ్యం : ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్

* ఘనంగా గాజులరామారం “శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ రేణుక ఎల్లమ్మ దేవాలయ” పునఃప్రతిష్టాపన కార్యక్రమం…

125 – గాజుల రామారం డివిజన్ శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ రేణుక ఎల్లమ్మ దేవాలయ పునఃప్రతిష్టాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ మాట్లాడుతూ దైవారాధనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని, అమ్మవారి కృపా కటాక్షాలతో ప్రజలంతా సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో జీవించాలి. ఆలయ నిర్మాణం అంటేనే ఎంతో శ్రమ, త్యాగం తో కూడుకున్న పని. ఇంత పెద్ద దేవాలయ నిర్మాణం చేపట్టాలంటే ఆలయ కమిటీ సభ్యుల సంకల్పానికి అమ్మవారి అనుగ్రహం తోడైనప్పుడే ఇంతటి నిర్మాణం సాధ్యం. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ గారిని అమ్మవారి ఫోటో, శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో పాక్స్ డైరెక్టర్ పరిశే శ్రీనివాస్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, సీనియర్ నాయకులు కస్తూరి బాల్ రాజ్, ఇబ్రహీం ఖాన్, మూసా ఖాన్, గోవర్ధన్ రెడ్డి, ఇబ్రహీం బేగ్, వాహీద్, బొయిని మహేష్, ప్రసాద్, శ్రీశైలం, జునైద్, ఆలయ కమిటీ సభ్యులు శ్రీశైలం, విజయ్ కుమార్, జ్ఞానేశ్వర్, కిరణ్, రవి, జగన్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS