వెల్గటూర్ ll శ్రీ చైతన్య పాఠశాలలో ఘనంగా ముందస్తు శ్రీకృష్ణాష్టమి వేడుకలు*
శ్రీకృష్ణుని ఆరాధించిన వారు నిత్యం శుభఫలాలు పొందడమే కాకుండా ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందుతారని పాఠశాల నిర్వాహకులు స్థానిక వెల్గటూర్ లోని శ్రీ చైతన్య స్కూల్లో వేడుకగా అట్టహాసంగా శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించినటువంటి సంబరాలకు హజరై వారు మాట్లాడారు. ప్రారంభానికి ముందు వారు ప్రాంగణంలో జ్యోతి ప్రజ్వాలన చేసి శ్రీకృష్ణుని విగ్రహానికి వేదమంత్రాల మధ్య ఘనంగా పూజ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కృష్ణాష్టమి పండుగ యువతలో చాలా ఉత్సహాన్ని నింపుతుందని మరియు ఆనందోత్సవాల మధ్య నిర్వహింపబడేదని చెప్పారు. ప్రతి ఒక్కరు సోదర భావం మరియు భక్తి భావంతో ఉండాలని, పలు పూజా కార్యక్రమాలను సాంప్రదాయబద్ధంగా చేపెట్టి భగవంతుని ఆశీస్సులు పొందాలని సూచించారు.
శ్రీకృష్ణుడు ఉద్భవించినటువంటి శ్రీకృష్ణాష్టమిని మన దేశంలోనే కాకుండా యావత్ ప్రపంచంలో కోలాహాలంగా నిర్వహించడం జరుగుతుందని తెలుపుతూ ఉత్సాహానికి ఆప్యాయతకు మారుపేరుగా నిలుస్తున్న శ్రీకృష్ణాష్టమి అత్యంత భక్తిశ్రద్ధలతో కుటుంభసభ్యులతో ఆనందోత్సవాల మధ్య నిర్వహిస్తారని చెప్పారు.
విద్యార్థుల్లో భక్తిభావాలను పెంపొందించడానికై మరియు చారిత్రాత్మకమైన శ్రీకృష్ణుని చరిత్ర తెలియజేయానికై పాఠశాలలో నేడు ముందస్తు కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించడం జరిగినదని ప్రత్యేకంగా శ్రీకృష్ణుడికి ఇష్టమైన పలు చైవేద్యాలను సమర్పించారు. సుమారు 100 మంది విద్యార్థులు శ్రీకృష్ణుని గోపికల వేషాధారణలతో విచ్చేసి పండుగ వాతవర్ణాన్ని రెట్టింపు చేశారు. విద్యార్థులు ప్రదర్శించినటువంటి నందగోపాల ఓ నందగోపాల నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ బిడారి సతీష్ ఉపాధ్యాయ బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.