అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ లో ప్రతిభ చాటిన హెడ్ కానిస్టేబుల్

అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ లో ప్రతిభ చాటిన హెడ్ కానిస్టేబుల్

TEJA NEWS

ప్రకాశం జిల్లా

5వ జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ లో ప్రతిభ చాటిన హెడ్ కానిస్టేబుల్ ను అభినందించిన ప్రకాశం జిల్లా ఎస్పీ పి.పరమేశ్వర రెడ్డి

ట్రిపుల్ జంప్ మరియు లాంగ్ జంప్ పోటీల్లో పతకాలు కైవసం

ఆస్ట్రేలియాలో జరగనున్న అంతర్జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ కు ఎంపిక

ఫిబ్రవరి 8-11 తేదీలలో హైదరాబాద్ నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో నిర్వహించిన 5వ నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్షిప్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున 50-54 ప్లస్ ఏజ్ గ్రూప్ విభాగంలో ప్రకాశం జిల్లాకు చెందిన హెడ్ కానిస్టేబుల్ విజయ భాస్కర్ ( HC-1843, S.N పాడు పీఎస్) పాల్గొని లాంగ్ జంప్ లో సిల్వర్, ట్రిపుల్ జంప్ లో కాంస్య పతకాలు సాధించి మే నెలల ఆస్ట్రేలియాలో జరగనున్న అంతర్జాతీయ మాస్టర్స్ అథ్లెటిక్స్ అర్హత సాధించినందుకు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అతని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి మెడల్స్ తో సత్కరించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS