36వ వార్డు వైసీపీ నుండి భారీగా చేరికలు

36వ వార్డు వైసీపీ నుండి భారీగా చేరికలు

TEJA NEWS

36వ వార్డు వైసీపీ నుండి భారీగా చేరికలు..

  • వైసీపీ బూత్ కన్వీనర్ తో సహా నలుగురు వాలంటీర్లు టీడీపీలోకి…

కావలి పట్టణం 36వ వార్డు నుండి పలువురు వైసీపీ ని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు.. వైసీపీ బూత్ కన్వీనర్ తాతా వెంకటేశ్వర్లు తో పాటు నలుగురు వాలంటీర్లు, వైసీపీ నేతలు టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.. మంగళవారం కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో తాతా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో తాతా బాలకృష్ణ, తాతా చందు, తాతా ప్రవీణ్, చుండ్రు ఆనంద్ బాబు, తాటిబోయిన పెంచలయ్య, తాటిబోయిన అజయ్, చుండ్రు మౌనిక, తదితరులు టీడీపీ లో చేరారు. వీరికి కావలి టీడీపీ – జనసేన – బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాధరంగా ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని వారికి హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమంలో పోకల వినోద్ పాల్గొన్నారు..

Print Friendly, PDF & Email

TEJA NEWS