TEJA NEWS

ఎన్ కన్వెన్షన్ కూల్చివేతలు ఆపండి : హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్:
ఎన్ కన్వెన్షన్ కూల్చివేతపై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వెంటనే కూల్చివేతలు ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

మాదాపూర్ లోని తుమ్మిడి చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ నిర్మించారనే ఫిర్యాదులతో శనివారం ఉదయం హైడ్రా కూల్చి వేతలు ప్రారంభించింది. హైడ్రా చర్యపై ఎన్ కన్వెన్షన్ యజమాని, ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ పై జస్టిస్ టి.వినోద్ కుమార్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది పి.శ్రీరఘురామ్ వాదనలు వినిపించారు.

ఈ సందర్భంగా అంశాలు కోర్టు దృష్టికి తీసుకు వచ్చా రు. ఎన్ కన్వెన్షన్ ఎలాంటి ఆక్రమణలకు పాల్పడలేద ని, పూర్తిగా పట్టాభూమి లోనే నిర్మాణాలు చేపట్టిం దని కోర్టుకు వివరించారు.

గతంలోనే ఎన్ కన్వెన్షన్ ఆక్రమణలకు పాల్పడిందని నోటీసులు ఇస్తే దానిపై హైకోర్టును ఆశ్రయించా మని, ఆ సమయంలో స్టే కూడా ఉందని, ఆ స్టే నోటీ సులను లెక్క చేయకుండా తాజా కూల్చివేతలపై ఎలాం టి నోటీసులు ఇవ్వకుండా కన్వెన్షన్ హాల్ ను కూల్చివే శారని వాదించారు.

నిబంధనలకు విరుద్ధంగా అధికారులు వ్యవహరిం చారని కోర్టుకు తెలుపగా వాదనలు విన్న న్యాయ స్థానం కూల్చివేతలను ఆపాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా ఇవాళ ఉదయం ఎన్ కన్వెన్షన్ హాల్ ను కూల్చి వేసిన హైడ్రా అధికారులు ఆ పరిసర ప్రాంతాల్లో తుమ్మిడి చెరువును ఆక్రమించుకుని చేపట్టిన మరికొన్ని నిర్మాణా లను సైతం కూల్చివేస్తు న్నారు.

ఈ క్రమంలో హైకోర్టు మధ్యాహ్నం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది..

Print Friendly, PDF & Email

TEJA NEWS