TEJA NEWS

మేలైన యాజమాన్య పద్ధతులతో వరిఅధిక దిగుబడి.

కడియం : కడియం మండలం దుళ్ల శివారు అయిలు సుబ్బారావు వ్యవసాయ క్షేత్రంలో బుధవారం రైతులతో పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. దీనిలో పాల్గొన్న వ్యవసాయ అధికారిణులు కె.ద్వారకాదేవి, శాంతా ఆలివ్ లు మాట్లాడారు. ప్రస్తుతం వరి పంట సాగులో మితిమీరిన రసాయనక ఎరువులు వినియోగం జరుగుతుందన్నారు. దీని వల్ల పంటకు జరిగే నష్టం, రైతులకు కలిగే కష్టం వివరించారు. వరి సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే యాజమాన్య పద్ధతులు అవలంబించాలన్నారు. ఈ పద్ధతి లో వేపపిండి వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు. ఎకరాకు ఐదు కేజీలు వేప పిండి వినియోగించాల్సి ఉంటుందన్నారు. వేప ఇక్కలు తో తయారు చేసే ఈ పింఫై కేజీ కేవలం రు 32 లుకు దొరుకుతుందన్నారు.ఐదు కేజీలు వేప పిండిని ఒక గుడ్డ లో మూట కట్టి తగిన నీటిలో 24 గంటలు నానబెట్టిన అనంతరం 100 గ్రాముల పాల ఇంగువాను కలిపి వరి పై పిచికారీ చేయాలని సూచించారు. నారు పోసిన 15 రోజుల తర్వాత నుంచి 20 రోజుల కోసారి పొట్ట దశ వచ్చే వరకు ఈ వేపపిండి ని వరిపై పిచికారీ చేయడం వల్ల ఎలాంటి చీడ పీడలకు అవకాశం లేకుండా పంటను కాపాడుతుందన్నారు. తక్కువ ధరకు లభించే ఈ వేపపిండి లోని చేదు గుణం వల్ల పురుగులు గుడ్లు పొదగడానికి దూరంగా వుంటాయని తద్వారా పంటకు ముందస్తు సెక్యూరిటీ వుంటూ అధిక దిగుబడులు సాధించవచ్చని రైతులకు సూచించారు.. అలాగే విలువైన రసాయనిక ఎరువులు వాడకం తగ్గి ఖర్చులు తగ్గుతాయన్నారు. రైతులంతా సేంద్రీయ యాజమాన్య పద్ధతుల్లో వరి సాగు చేసి తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించవచ్చని ద్వారకా దేవి అన్నారు. అలాగే వేప పిండిని ఏ విధంగా కలపాలో ప్రత్యక్షంగా చూపించి వరి క్షేత్రంలో పిచికారి చేయించారు. అలాగే వేద భూమి సీఈఓ రత్నకుమారి మాట్లాడుతూ రైతులకు కేంద్ర ప్రభుత్వం, నాబార్డు ద్వారా ద్వారా అందించే పధకాలను, వాటికి సంబంధించి నియమ నిబంధనలు వివరించారు. అలాగే రైతులు తమ పంటల సాగులో ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధికారులకు వివరించారు. వరి పంట చేతి కొచ్చాక అమ్మకాలు లో పడరాని పాట్లు పడుతున్నామని అయిన కాడికి అమ్ముకోవాల్సివస్తుందని రైతులు వాపోయారు.దీనిపై ద్వారాకాదేవి స్పందిస్తూ ఎట్టి పరిస్థితుల్లో ను గిట్టుబాటు ధర ఉంటుందని , అలాంటి సమస్య రైతులకు వస్తే నేరుగా తనకు ఫోన్ చేయాలని తగిన చర్యలు తీసుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొండపల్లి పట్టియ్య, ఉప సర్పంచ్ తోకల శ్రీనివాస రావు, మాజీ ఉప సర్పంచ్ చిక్కాల రాముడు, మెంటర్ అయిలు లక్ష్మణ్, ఎల్.టు రమణ, సచివాలయం వ్యవసాయ, ఉద్యాన శాఖ ఉద్యోగులు రాజ్యలక్ష్మి, సరోజిని, ఐసీఆర్పీ లు, రైతులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS