TEJA NEWS

గృహ నిర్మాణ పనులు వేగవంతం చేయాలి
-ఇళ్ళ నిర్మాణ ప్రక్రియ లో స్తబ్దత గా ఉంటే ఎలా?

కలెక్టర్ పి. ప్రశాంతి
రాజమహేంద్రవరం,
రాష్ట్ర ప్రభుత్వం 100 రోజుల ప్రణాళిక రూపొందించడం ద్వారా గృహ నిర్మాణ పనులు చేపట్టి వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు. మంగళవారం సాయంత్రం పి ఎమ్ ఏ వై – గృహ నిర్మాణ పనులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ గృహ నిర్మాణ లక్ష్య సాధనలో నిర్ణాయక పాత్ర, సరైనా ప్రణాళికా బద్ధంగా పనులు చేపట్టడం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ఆదేశాల మేరకు పనులు చేపట్టాలని, విధి నిర్వహణలో స్తబ్దత గా ఉంటే  ఎలా? అని ప్రశ్నించారు. మీరు నిర్దేశించుకున్న హౌసింగ్ పనులకి ఉపాధి హామీ పని దినాలను అనుసంధానం చేసే దిశలో ఏపీఓ లతో సమావేశ నిర్వహించడం, జాబ్ కార్డు లేని వారికి వాటిని కల్పించడం పై చొరవ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఉపాధి హామీ పథకం కింద పని దినాలు కల్పన, ఆ రోజులకు వేతనం, మెటీరియల్ కంపోనెంట్ కింద ముడిసరుకు, అదనపు ఋణ సౌకర్యం కల్పించడం జరగాలని పేర్కొన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో హౌసింగ్ నిర్మాణాల  కోసం  అదనపు ఋణ సౌకర్యం కల్పించడం జరగాలన్నారు.   ప్రభుత్వ హౌసింగ్ లే అవుట్ స్ధానిక సంస్థలు ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.  ఇందుకు సంబంధించి పట్టణ, గ్రామీణ పరిధిలోకి వచ్చే స్థానిక సంస్థల అధికారులు చర్యలు తీసుకోవడం తప్పనిసరి అన్నారు. లేఔట్ లలో ఇళ్లు నిర్మించిన లబ్దిదారులకు రేషన్ కార్డు మార్పు, విద్యుత్తు కనెక్షన్, త్రాగునీటి సరఫరా తదితర సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
కార్యక్రమంలో కె ఆర్ ఆర్ సి ఎస్ డీ సీ/ఇన్చార్జి హౌసింగ్ పిడి ఆర్. కృష్ణ నాయక్, పిడి డీఆర్డీఏ ఎన్వివిఎస్ మూర్తి, డిపివో డి. రాంబాబు , హౌసింగ్ ఈ ఈ లు జీ. పరశురామ్, సూరిబాబు, డీఎల్డివో పి. వీణా దేవి, డివిజనల్ పంచాయతీ అధికారి ఎమ్. నాగలత తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS