TEJA NEWS

సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా హెచ్.పీ గ్యాస్ సేవలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలుకస్టమర్ సర్వీస్ పేరుతో అదనంగా మరో 50 రూపాయల బాదుడు హెచ్.పీ గ్యాస్ యాజమాన్యానికి ఎన్నిసార్లు కంప్లీట్ చేసిన మారని తీరు.

సూర్యాపేట జిల్లాలో పేరుపొందిన హెచ్.పీ గ్యాస్ గోపయ్య చారి ఎంటర్ప్రైజెస్ లో హెచ్.పీ గ్యాస్ ను సూర్యాపేట జిల్లా ప్రజలు ఎక్కువగా వాడుతున్నారు. ఈ గ్యాస్ సేవలు గతంలో సూర్యాపేట పట్టణం వరకే డోర్ డెలివరీ ఉండేవి, సూర్యాపేటలో మున్సిపాలిటీ లో పలు గ్రామపంచాయతీలు విలీనం అయిన తర్వాత కూడా అదే పద్ధతిని పాటిస్తూ వారంలో ఎప్పుడు బుక్ చేసిన మాత్రమే బిల్స్ చేస్తూన్నారు. దీంతో సూర్యాపేట జిల్లా పరిసర ప్రాంత గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై గ్యాస్ ఏజెన్సీ కి జిల్లా పరిసర ప్రాంత ప్రజలు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసిన, సదరు వ్యక్తికి మాత్రమే తమ సమస్యను పరిష్కరిస్తూ ఇతరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాలయాపన చేస్తున్నారు తప్ప నిత్య సేవలు అందుబాటులోకి రాట్లేవని ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు పరిశీలించి సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా గ్రామస్తులకు హెచ్. పి గ్యాస్ సేవలను మెరుగుపరచాలని కోరుతున్నారు. భారత్ గ్యాస్, ఇండియన్ గ్యాస్ సేవలు గ్రామాల్లో అందుబాటులో ఉంటూ గ్రామంలో అద్భుతంగా డోర్ డెలివరీ చేస్తున్నారు కానీ, హెచ్.పీ గ్యాస్ మాత్రం డోర్ డెలివరీలో రోడ్డుమీదికి వస్తే తప్ప గ్యాస్ ఇవ్వమని హుకుం జారీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఇక్కడ ప్రజలు కోరుతున్నారు.


TEJA NEWS