TEJA NEWS

హైడ్రా నెక్స్ట్ టార్గెట్ పల్లా”అనురాగ్ యూనివర్శిటీ?

హైదరాబాద్:
హైడ్రా.. ఈ పేరు వింటేనే కబ్జాదారుల గుండెల్లో బుల్డో జర్లు పరిగెడుతున్నాయి. ఎప్పుడు ఏ నిర్మాణంపై బుల్డోజర్‌ అటాక్ జరుగు తుందో అన్న టెన్షన్‌ కబ్జాదారుల్లో మొదలైంది.

తాజాగా ఎన్ కన్వెన్షన్‌ కూల్చివేతతో హైడ్రాపై అటె న్షన్‌ క్రియేట్ అవగా.. నెక్స్ట్ టార్గెట్ ఎవరనేది ఆసక్తి కరంగా మారింది. ఇప్పటికే అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారి గుండెల్లో గుబులు పుట్టించగా.. నెక్స్ట్ హైడ్రా చేపట్టే బుల్డోజర్ అటాక్ అనురాగ్ యూనివర్శిటీ పైనే అంటూ వార్తలు చక్క ర్లు కొడుతున్నాయి. దీంతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరా వుకు హైడ్రా టెన్షన్ పట్టుకుం దానే ప్రచారం జరుగు తుంది..

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం వెంకటాపూర్ శివారులో నాదం, వెంకటా పురం చెరువులు ఆక్రమ ణకు గురవుతున్నాయి. బఫర్ జోన్ ప్రాంతాల్లో అనురాగ్, నీలిమ ఇన్స్టి ట్యూట్ లు అక్రమ కట్టడాలు నిర్మించారని ఇరిగేషన్ అధి కారులు గుర్తించారు. దీంతో పల్లా రాజేశ్వర్ అనురాగ్ ఇన్స్టిట్యూట్‌పై భూముల వివాదం రాజుకుంటుంది.

ఇప్పటికే చెరువు బఫర్‌ జోన్‌ను ఆక్రమించి నిర్మా ణాలు చేపట్టారని బీఆర్ఎస్ నేత, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై కేసు నమోదైంది. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం వెంకటాపూర్ రెవెన్యూ పరిధిలోని నాదం చెరువు బఫర్‌జోన్‌లో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు.

చెరువు బఫర్‌జోన్‌లో సుమారు ఎకరన్నర భూమి ని ఆక్రమించి అనురాగ్ ఇన్‌స్టిట్యూషన్‌కు సంబంధిం చిన అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని నీటి పారుదలశాఖ ఏఈ పర మేష్‌, పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో FTL పరిధి లో అనురాగ్ యూనివర్శిటీ భవనాలను ఆక్రమించి కడుతున్నారా? లేదా అనే అంశంపై త్వరలోనే ఇరిగే షన్, రెవిన్యూ అధికారులు హైడ్రాకు రిపోర్టు పంపను న్నారు.

మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం వెంకటాపూర్ గ్రామం సర్వే నెంబర్ 813 లోని నాడెం చెరువు బఫర్ జోన్ లో అనురాగ్ యూని వర్సిటీ, నీలిమ మెడికల్ కాలేజ్, నీలిమ ఆసుపత్రి నిర్మించారని గతంలో కూడా వివాదం కొనసాగింది.

నంగారాబేరి లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షు డు గణేష్ నాయక్ గతంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్, రెవెన్యూ శాఖ అధికారులకు, ఇరిగేషన్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే అధికారు లు ఎవరూ స్పందించకపో వడంతో గణేష్ నాయక్ హైకోర్టును ఆశ్రయించాడు.

పూర్తి విచారణ అనంతరం హైకోర్టు ద్వారా అనురాగ్ యూనివర్సిటీ, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు వెలువడే అవకాశం ఉండటంతో అప్రమత్తమైన ఇరిగేషన్ శాఖ అధికారులు…

ముందస్తుగా పోచారం ఐటీ కారిడార్ పిఎస్ లో అను రాగ్ యూనివర్సిటీ, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS