TEJA NEWS

జిల్లాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన హైడ్రా.. ఎవరి నోట విన్నా ఇదే మాట

ఖమ్మం..అక్రమంగా చెరువులు, శిఖం భూములు, నాలాలు కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలపై జీహెచ్ఎంసీ పరిధిలో హైడ్రా దూకుడు పెంచిన విషయం తెలిసిందే.

నిర్మాణం అక్రమమని, కబ్జా చేసి నిర్మించారని తెలిస్తే చాలు బుల్డోజర్ల సాయంతో వాటిని నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తుంది హైడ్రా. ఈ విషయంలో పలు రాజకీయ పక్షాలు, నాయకులు హైడ్రా పనితీరును మెచ్చుకోవడమే కాకుండా తమ జిల్లాలకు విస్తరించాలని వినతులు ఇస్తుండటంతో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచన చేస్తోంది. ఈ ప్రక్రియ ఒక్క హైదరాబాద్‌కు మాత్రమే పరిమితం చేయకుండా జిల్లాలో ఆక్రమణకు గురైన చెరువులను రక్షించాలన్న డిమాండ్ రోజురోజుకు పెరుగుతుంది. ఇప్పటికే అభిప్రాయ సేకరణ చేపట్టిన సీఎం అధికారులు అతి త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు ప్రచారం జరుగుతుంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో..

భూముల ధరలకు రెక్కలు రావడం.. ఎకరా భూమి కోట్ల రూపాయలు పలుకుతుండటంతో అక్రమార్కులు చెరువుల దగ్గర భూములను ఎంచుకుని ఎకరాల కొద్ది కొట్టేసిన విషయం స్పష్టం. హైడ్రా ఒకటి వస్తుందని, రానున్న రోజుల్లో తమకు ఇబ్బందులు తప్పవనే విషయం గుర్తించని అక్రమార్కులు జిల్లాలో అనేక చెరువులను కబ్జా చేశారు. వెంచర్ల పేరిట అనుమతులు తీసుకుని పక్కనే ఉన్న చెరువు భూములను, ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని విక్రయించారు. కొందరు ఏకంగా బహుళ అంతస్థుల నిర్మాణాలు చేపట్టారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ పరిధిలో హైడ్రా ఏర్పాటు చేయడంతో ఇక్కడి అక్రమార్కులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. జిల్లాలో హైడ్రా తరహా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారా? వస్తే ఎలా ఉంటుంది? ఎవరెవరి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఏ ఏ చెరువులు కబ్జాకు గురయ్యాయి? అనే విషయాల మీద అనేకమంది ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఏ ఇద్దరు రియల్టర్లు, రాజకీయ నాయకులు కలిసిన ఈ విషయం మీదే మాట్లాడుకోవడం విశేషం.

ప్రధానంగా లకారం.. మున్నేరు..

ఖమ్మంలో ప్రధానంగా లకారం చెరువు దాదాపు 200 పైగా ఎకరాల్లో విస్తరించింది. ప్రస్తుతం అది వంద ఎకరాలకు కుంచించుకుపోయిన ట్లు సమాచారం. లకారం ఖమ్మం నగరం నడిబొడ్డున ఉండటం.. నాలుగు దిశలలో పూర్తిస్థాయిలో వివిధ నిర్మాణాలు చోటుచేసుకోవడం, అంతేకాకుండా ప్రభుత్వ భూమిని సంవత్సరాల కొద్ది లీజు పేరిట తీసుకుని భవనాలు నిర్మించుకుని వ్యాపారాలు చేయడంతో లకారం రూపురేఖలు మారిపోయాయి. మున్నేరు పరీవాహక ప్రాంతంలో కూడా అదే పరిస్థితి. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లలో అనేక నిర్మాణాలు జరగడంతో వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ అక్రమ నిర్మాణాల కారణంగా వరదలు రావడం వందలాది కుటుంబాలను ప్రతీ ఏటా షెల్టర్లకు తరలించడం సాధారణంగా మారింది. ఈ ఆక్రమణల కారణంగానే ఏ చిన్నపాటి వర్షం వచ్చినా నగరం వరద ప్రవాహంలో మునిగిపోతుందని, అస్తవ్యస్తంగా మారుతుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ అనేక చెరువులు ఆనవాళ్లు లేకుండా పోయాయని, అన్ని నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. హైదరాబాద్ తరహాలో ఇక్కడ కూడా హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి చెరువులను, ప్రభుత్వ భూములను పరిరక్షించాలని డిమాండ్ రోజురోజుకు పెరుగుతుంది.

పార్టీలకతీతంగా మద్దతు..

అక్రమ నిర్మాణాలను కూల్చివేసి..చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములను కాపాడుతున్న హైడ్రా విషయంలో కాంగ్రెస్ పార్టీ నుంచే కాకుండా ఇతర పార్టీల నుంచి కూడా పాజిటివ్ టాక్ వస్తుంది. సొంత ఎమ్మెల్యేలే తమ నియోజకవర్గాలను విస్తరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కొందరు రాష్ట్ర వ్యాప్తంగా ఈ సిస్టమ్ ను ఇంప్లిమెంట్ చేయాలని లేఖలు ఇస్తున్నారు. ఒక్క కాంగ్రెస్ పార్టీ నుంచే కాకుండా, ఇతర పార్టీల నుంచి కూడా ప్రశంసలు వస్తుండటంతో పాటు పలు సూచనలు కూడా చేస్తుండటంతో ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా వినతులతో తమ దగ్గరకు వచ్చిన ప్రజలతో మంత్రులు కూడా ఈ విషయమై ఆరా తీస్తు వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అక్రమ కూల్చివేతల విషయంలో ప్రజలు, యూత్ ఏమనుకుంటున్నారు? పర్యావరణ వేత్తల అభిప్రాయం ఏంటి? భవిష్యత్‌లో జిల్లాలకు విస్తరిస్తే ఎలా ఉంటుంది? అనే విషయమై ఫీడ్ బ్యాక్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మెజార్టీ ప్రజలు అభిప్రాయం పాజిటివ్‌గానే ఉన్నట్లు టాక్ వస్తుంది.

ఖమ్మం నుంచి అనేక ఫిర్యాదులు..

ప్రభుత్వ స్థలాల ఆక్రమణ, చెరువులు, కుంటల కబ్జా విషయంలో ఖమ్మం నుంచి ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఈ ఫిర్యాదులు ఆక్రమణ విషయంలోనే కాకుండా ఎలాంటి అనుమతులు లేకుండానే బహుళ అంతస్తులు నిర్మించారని, ప్రభుత్వ భూములు ఆక్రమించారని, వాటిని విడిపించే వ్యవస్థను జిల్లాలో ఏర్పాటు చేయాలని వినతులు


TEJA NEWS