TEJA NEWS

ఇష్టాన్ని సేవా రూపంలో చూపిస్తే సమాజం ఉన్నతంగా ఉంటుంది
-మంత్రి దుర్గేష్
రాజమహేంద్రవరం, :
ఇష్టాన్ని సేవా రూపంలో చూపిస్తే సమాజం ఉన్నతంగా ఉంటుందని, సినీ అభిమానం సేవ రూపంలో చూపించడం ఎంతో మంచి పరిణామమని మెగా కుటుంబ అభిమాని పడాల శ్రీనివాసు క్రమం తప్పకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ చిరంజీవి అభిమానులు గర్వపడేలా చేస్తున్నాడని మంత్రి కందులు దుర్గేష్ అన్నారు. ఆగష్టు 22 వ తేదీ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు పురస్కరించుకుని సామాజిక సేవకుడు, చిరంజీవి బస్టాండ్ వ్యవస్థాపకులు పడాల శ్రీనివాసు ఆధ్వర్యంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న వారోత్సవాలు తో ముగిశాయి. ముగింపు కార్యక్రమం తిలక్ రోడ్ లో నిర్వహించారు. ముఖ్యఅతిథిగా మంత్రి కందులు దుర్గేష్ పాల్గొని వీల్ చైర్లు, చెవిటి మిషనులు, పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పడాల శ్రీనివాసు సేవలు కొనియాడారు. చిరుద్యోగి అయినా ఎంతో విశాల హృదయంతో తన వంతుగా సమాచారం చేయడం ఆదర్శనీయమన్నారు, కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఎర్ర వేణుగోపాల్ రాయుడు మాట్లాడుతూ ఇలానే ప్రతి సినీ హీరో అభిమాని తన ఇష్టాన్ని సేవా రూపంలో చూపిస్తే సమాజం ఉన్నతంగా ఉంటుందన్నారు. వారోత్సవాలు సందర్భంగా ప్రకృతి పరిరక్షణకై మొక్కలు నాటే కార్యక్రమం, విద్యార్థులకు వితరణ కార్యక్రమాలు అన్న దానాలు, స్వచ్ఛభారత్ లో భాగంగా గోదావరి నది ప్రక్షాళన ఇలాంటి కార్యక్రమాలు చేయడం ఆదర్శనీయమన్నారు.
కార్యక్రమంలో చిరుకూరి వీర్రాజు, జనసేన నాయకులు చిక్కాల బాబులు, ఆనంద్, యడ్ల మహేష్, మర్సే శ్రీను, సుమ, భవాని, లక్ష్మి, గౌరీ, వేమగిరి నుంచి ప్రకాష్ లైటింగ్ నాగేశ్వరరావు, బిజెపి నాయకులు నిడదవోలు వెంకటేశ్వరరావు, జనసేన నాయకులు దేసినీడి రాంబాబు, పడాల యశోదా కృష్ణ ఫ్రెండ్ సర్కిల్ యువత, పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS