తెలంగాణలో ఇకపై స్వైపింగ్ కార్డులు.. తెల్ల రేషన్ కార్డుకు అర్హత ఇదే…!!!
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇవ్వనున్నట్టు ప్రభుత్వం స్పష్టం చేసింది.
త్వరలోనే దీనికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయనున్నారు.
వివరాల ప్రకారం.. తెలంగాణలో కొత్త రేషన్‌కార్డుల జారీపై నేడు కేబినెట్ సబ్ సమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇక, తర్వాత జరగబోయే మీటింగ్‌లో దీనికి సంబంధించిన విధివిధానాలను ఖరారు చేయనున్నారు. కాగా, రాబోయే రేషన్ కార్డులు స్వైపింగ్ కార్డ్స్ మోడల్‌గా ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం.
కేబినెట్ సబ్ కమిటీలో నిర్ణయాలు ఇవే..
ఇదిలా ఉండగా.. తెలంగాణలో చాలా కాలంగా రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో లక్షలాది మంది కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా విధి విధానాలు రూపొందించి అర్హులైన వారికి రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.