ఎమ్మెల్యే పంచకర్ల పై హర్షం వ్యక్తం చేసిన ఇందల అశోక్.
అనకాపల్లి జిల్లా పరవాడ మండలం కలపాక పంచాయితీ సీనియర్ జనసేన నాయకుడు కలపాక పంచాయతీ మాజీ సర్పంచ్ ఇందల రామారావు కుమారుడు ఇందల అశోక్ కుమార్ మూల స్వయంభువరం గ్రామం తరలింపు పై స్థానిక ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే పంచకర్ల మూల స్వయంభు వరం తరలింపు పై అసెంబ్లీలో ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం తో అశోక్ కుమార్ తో పాటు గ్రామ ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ ఏళ్ల తరబడి కాలుష్యం బారిన పడి గ్రామస్తులు అనారోగ్యం పాలవుతున్న, భూగర్భ జలాలు కలుషితమై తాగటానికి నీరు లేక తీవ్ర ఇబ్బందులు గురవుతున్న ఇప్పటివరకు పట్టించుకునే నాయకుడే కొదవయ్యారని మా నాన్నగారు సర్పంచిగా చేసే సమయంలో దీనిపై తీవ్రమైన ఉద్యమాలు చేసిన ఎవరు పట్టించుకోలేదని ఈ మా గ్రామం పై ఈరోజు పంచకర్ల రమేష్ బాబు అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం ఒక శుభ పరిణామం అని అతి తొందరలోనే గ్రామాన్ని తరలించే ప్రయత్నం చేస్తారని గ్రామస్తులందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారని ఆయన తెలియజేశారు