ఉప్పల్ స్టేడియంలో భారీ బందోబస్తు మధ్య భారత్- బంగ్లాదేశ్ టి20 మ్యాచ్
హైదరాబాద్ శివారులోని ఉప్పల్ స్టేడియంలో జరగనున్న భారత్, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ 20 మ్యాచ్ కు భారీ భద్రత ఏర్పాటు చేశామని, రాచకొండ సిపీ సుధీర్ బాబు అన్నారు.
300 సిసి కెమెరాలతో నిఘా ఏర్పాటు చేసినట్లు సిపి తెలిపారు. ఇప్పటికే ఉప్పల్ స్టేడియం పరిసరాల ప్రాంతాలు తమ ఆధీనం లోకి తీసుకున్నమన్నారు. ఇప్పటికే సిరీస్‌ను గెలుచు కున్న టీమిండియా నేటి మ్యాచు లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది.
మూడో టీ20లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలని బంగ్లా అనుకుంటోంది. ఇప్పటికే ఇరు జట్లు హైదరాబాద్ చేరుకు న్నాయి.ఉప్పల్ మ్యాచ్‌కు వరుణుడి నుంచి ముప్పు పొంచి ఉంది.
ఇవాళ వర్షం కురిసే అవ కాశముందని, ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉప్పల్ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. టాస్ గెలిచిన టీమ్ ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.ఉప్పల్‌లో మ్యాచ్ ఉండడంతో పోలీసులు భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు చేశారు.
క్రికెట్ ప్రేమికుల కోసం ఇవాళ అర్ధరాత్రి వరకు మెట్రో సేవలు అందు బాటులో ఉండనున్నాయి.