కుత్బుల్లాపూర్ లో ఘనంగా “అంతర్జాతీయ యోగా దినోత్సవ” వేడుకలు

కుత్బుల్లాపూర్ లో ఘనంగా “అంతర్జాతీయ యోగా దినోత్సవ” వేడుకలు

TEJA NEWS

International Yoga Day" celebrations in Quthbullapur

కుత్బుల్లాపూర్ లో ఘనంగా “అంతర్జాతీయ యోగా దినోత్సవ” వేడుకలు…
,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,
అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కేపీ.వివేకానంద …

యోగను అభ్యసించడం ద్వారా శారీరక ధృడత్వంతోపాటు మానసిక పరిపక్వత లభిస్తుంది: ఎమ్మెల్యే కేపీ. వివేకానంద …

యధా రాజా…తథా ప్రజా…. ఎమ్మెల్యే కేపీ. వివేకానంద ఫిట్గా ఉన్నారు కనుక నియోజకవర్గం ఫిట్ గా ఉంది…ఎమ్మెల్యే కేపీ. వివేకానంద గారే మా శివశక్తి ధ్యాన యోగ బ్రాండ్ అంబాసిడర్… : శివ శక్తి ధ్యాన యోగా ఆచార్యులు మల్లేష్

129 – సూరారం డివిజన్ షాపూర్ నగర్ లోని ఎం.జే గార్డెన్స్ నందు శివశక్తి ధ్యాన యోగ ఆధ్వర్యంలో నిర్వహించిన “అంతర్జాతీయ యోగా దినోత్సవం” వేడుకల కార్యక్రమానికి ఎమ్మెల్యే కేపీ.వివేకానంద గారు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ అతి పురాతనమైన భారతీయ సంస్కృతిలో భాగమైన యోగను అభ్యసించడం ద్వారా శారీరక ధృడత్వంతోపాటు మానసిక పరిపక్వత లభించి లక్ష్యంపై దృష్టి సారించవచ్చన్నారు. నేను గత 14 సంవత్సరాలుగా నిత్యం యోగాను చేయడం ద్వారా ఇటుగా ఉండగలుగుతున్నానని, ప్రతి ఒక్కరూ యోగాను అభ్యసించి ప్రపంచానికి యోగా విశిష్టతను తెలియజేయాలన్నారు.

అనంతరం శివశక్తి ధ్యానయోగ నిర్వాహకులు, యోగ ఆచార్యులు మల్లేష్ మాట్లాడుతూ యోగాను ఆదేశించడం ద్వారా ప్రతి మనిషి దృఢంగా తయారవుతారన్నారు. అంతేకాక యధా రాజా… తథా ప్రజా అన్నట్టుగా కుత్బుల్లాపూర్ శాసనసభ్యులు ఎమ్మెల్యే కేపీ. వివేకానంద నిత్యం యోగ చేస్తూ ఫిట్ గా ఉండటం వల్లే ప్రజలందరినీ కలుస్తూ కుత్బుల్లాపూర్ ను అభివృద్ధిలో ముందు ఉంచుతున్నారన్నారు. నాయకుడు ఫిట్ గా ఉన్నప్పుడే ఆ నియోజకవర్గంలోని ప్రజలు కూడా ఫిట్ గా ఉంటారన్నారు. మన ఎమ్మెల్యే కేపీ. వివేకానంద గారే శివశక్తి ధ్యాన యోగ కేంద్ర బ్రాండ్ అంబాసిడర్ అని అన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, శ్రమశక్తి అవార్డు గ్రహీత వృద్దాపుర మదన్ గౌడ్, రుద్ర అశోక్, ముకుందం, మల్లారెడ్డి, రేగూరి ప్రవీణ్ కుమార్ గుప్తా, సాజిద్, ముకుందం, యోగా ఆచార్యులు పూర్ణ సాయి, విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS

Comments

No comments yet. Why don’t you start the discussion?

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి