TEJA NEWS

జగిత్యాల జిల్లా బిసి సంక్షేమ సంఘం సమావేశంలో పాల్గొని బిసి ల సమరభేరి పోస్టర్ ఆవిష్కరణ చేసిన బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు..
బిసిల సమరభేరి కార్యక్రమం తేది: 25-11-2024 సోమవారం రోజున రవీంద్రభారతి, హైదరాబాద్ నందు ఏర్పాటు చేసినందున ఇట్టి కార్యక్రమానికి సంబంధించిన బిసి ల సమరభేరి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం శివసాయి రెస్టారెంట్ నందు కౌండిన్య హోటల్ నందు జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మినారాయణ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ నీలం వెంకటేష్ , స్టేట్ జనరల్ సెక్రటరీ టి.నందగోపాల్ , స్టేట్ జనరల్ సెక్రటరీ చిగుర్ల శ్రీనివాస్ , జిల్లా జనరల్ సెక్రటరీ ఆవారి లత కు స్వాగతం పలికినారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు పాల్గొని బిసి ల సమరభేరి పోస్టర్ ఆవిష్కరణ చేసినారు. హైదరాబాదులో జరిగే బీసీల సమరభేరి కార్యక్రమంలో రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి మరియు జగిత్యాల జిల్లాలోని అన్ని మండలాల నుండి బీసీ నాయకులు అన్ని కుల సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని బీసీల సమస్యల గురించి ఏర్పాటుచేసిన సమరభేరి కార్యక్రమంలో పాల్గొని సభను జయప్రదం చేయగలరని, బిసి బంధువులారా రండి, కదలిరండి బీసీల ఐక్యతను చాటండి 70 శాతం బీసీలకు కేవలం 2000 కోట్ల బడ్జెట్ మాత్రమేనా? 70 కోట్ల జనాభాకు కేంద్రంలో ఒక ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలి. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాదులో జరిగే ఈ సమరభేరి కార్యక్రమాన్ని అందరం కలిసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం.


ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, బిసి యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు కొక్కు గంగాధర్, బి.సి యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుపురం రాంచందర్, బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు దండుగుల వంశీ, బి.సి మహిళా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాచకొండ రోజా (న్యాయవాది), బిసి సంక్షేమ సంఘం సాంస్కృతిక కార్యదర్శి బొమ్మిడి నరేష్ కుమార్, నియోజకవర్గ అధ్యక్షురాలు బండపెల్లి మల్లీశ్వరి, బి.సి సంక్షేమ సంఘం పట్టణాధ్యక్షుడు రాపర్తి రవి, కోటగిరి రాజేష్, చిలుక రాజలింగం, యూత్ కో-ఆర్డినేటర్ హృషికేష్, బిసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS