TEJA NEWS

పర్యావరణాన్ని రక్షించడానికి వినాయక చవితికి ప్రతి ఒక్కరు మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని.మాజీ ఎమ్మెల్యే నాగిరెడ్డి…

విశాఖ జిల్లా కొత్త గాజువాక 65 వార్డ్ కాకతీయ జంక్షన్ వద్ద వినాయక చవితి సందర్భంగా 65 వార్డ్ వైసీపీ సీనియర్ నాయకులు మద్దాల అప్పారావు, ఇరోతి గణేష్,నాగిశెట్టి శ్రీను వీరి ఇరువురి ఆధ్వర్యంలో 500 మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా గాజువాక స్థానిక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి, 64వ వార్డ్ ఇంచార్జ్ ధర్మాల శ్రీనివాసరావు, 74 వ వార్డు కార్పొరేటర్ తిప్పల వంశీరెడ్డి, గాజువాక మాజీ ఇంచార్జ్ తిప్పల దేవన్ రెడ్డి వచ్చేసి వీరి ఇరువురి చేతుల మీదుగా మట్టి వినాయక ప్రతిమలను భక్తులకు పంపిణీ చేశారు.గాజువాక మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ ముందుగా భక్తులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం పర్యావరణాన్ని రక్షించాలంటే ప్రతి భక్తులు ప్లాస్టర్ అఫ్ పారిస్ విగ్రహాలను విడిచి పవిత్రమైన వినాయక మట్టి విగ్రహాలను పూజించాలని అన్నారు.

ఇటువంటి మహత్తర కార్యక్రమం నిర్వహించిన మద్దాల అప్పారావు,ఇ రోతి గణేష్,నగిశెట్టి శ్రీను వీరి ఇరువురికి అభినందనలు తెలియజేస్తూ ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు మీ పై ఎల్లవేళలా ఉండాలని అన్నారు.నిర్వాహకులు మాట్లాడుతూ రోజు రోజుకీ పర్యావరణ కాలుష్యం పెరిగిపోతూ ఉంటుంది.ఆ పర్యావరణ కాలుష్యాన్ని పూర్తిగా నిర్మూలించాలంటే ప్రతిభక్తులు ప్లాస్టర్ అఫ్ పారిస్ విగ్రహాలను పూజించడం మానేసి.. మేము ఇచ్చిన పవిత్రమైన మట్టి వినాయక ప్రతిమలను ఈ వినాయక చవితికి మీ గృహంలో పూజ గదిలో పెట్టి పూజించి పర్యావరణాన్ని రక్షించిందని అన్నారు.అలాగే వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు మీ పై ఎల్లవేళలా ఉండాలని మనసారా కోరుకుంటున్నాను అని అన్నారు.ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బులోక అప్పలనాయుడు తారక్ విఘ్నేష్ సంపత్ అంగు తదితరులు పాల్గొన్నారు…

Print Friendly, PDF & Email

TEJA NEWS