TEJA NEWS

మంత్రి సీత‌క్క ఇలాకా లో తొలి కంటైనర్ పాఠశాల

హైదరాబాద్:

రాష్ట్రంలో తొలి కంటెయినర్ స్కూల్ అందుబాటులోకి వచ్చింది. తొలిసారిగా మలుగు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ప్రభుత్వ స్కూల్‌ను కంటెయినర్‌లో ఏర్పాటు చేశారు.

ఈ పాఠ‌శాల‌ను పంచా య‌తీ రాజ్, గ్రామీణాభి వృద్ది, మ‌హిళా శిశు సంక్షేమ శాఖ‌ల మంత్రి సీత‌క్క ప్రారంభించారు.

ములుగు జిల్లా కన్నాయి గూడెం మండలంలోని కాంతనపల్లి అటవీ ప్రాంతంలో బంగారుపల్లి ఆవాస గ్రామం ఉంది. ప్ర‌స్తుతం గుడిసెలో న‌డుస్తున్న పాఠ‌శాల శిధిలావ‌స్త‌కు చేరుకుంది.

అయితే అట‌వి ప్రాంతం కావ‌డంతో కొత్త పాఠశాల భవన నిర్మాణానికి అటవీ అధికారులు అనుమతులి వ్వలేదు. దీంతో ఇక్క‌డ కంటెయిన‌ర్ పాఠ‌శాల ఏర్పాటుకు మంత్రి సీత‌క్క శ్రీకారం చుట్టారు.

ములుగు నియోజ‌క‌వ‌ర్గం లోని తాడ్వాయ్ మండ‌లం లో కంటైనర్ ఆసుప‌త్రిని మంత్రి సీత‌క్క అందుబా టులోకి తేవ‌డంతో స్థానిక ప్ర‌జ‌ల‌కు వైద్య సేవ‌లు అందుతున్నాయి. అదే కోవ‌లో ఇప్పుడు కంటేయి న‌ర్ పాఠ‌శాల‌ను ప్రారంభిం చారు.

ఈ కంటెయినర్ పాఠశాల 25 అడుగుల వెడల్పు, 25 అడుగుల పొడవు ఉంటుం ది. ఇందులో ఇద్ద‌రు టీచ‌ర్లు ప‌నిచేస్తుండ‌గా..వారితో పాటు విద్యార్ధులు సౌక‌ర్య‌ వంతంగా కూర్చునే విధం గా కంటేయిన‌ర్ పాఠ‌శాల‌ ను అందుబాటులోకి తెచ్చారు.


TEJA NEWS