TEJA NEWS

పేద విద్యార్థులకు అండగా మధుర చారిటబుల్ ట్రస్ట్

మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గంలోని రామంతపూర్ డివిజన్ లో జిల్లా పరిషత్ హై స్కూల్లో మధుర చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు చేయూత కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్, మధుర చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ *రాగిడి లక్ష్మారెడ్డి హాజరు కావడం జరిగింది.

రామంతపూర్ డివిజన్ లో గల జిల్లా పరిషత్ హై స్కూల్ లో మధుర చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మధుర చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ & చైర్మన్ రాగిడి లక్ష్మారెడ్డి పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు నోటు పుస్తకాలు స్టడీ మెటీరియల్స్, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు నగదు పారితోషకం తో పాటు, ప్రధమ శ్రేణి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి, బ్యాచ్ లను మరియు ప్లేట్లను తన చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.

రాగిడి లక్ష్మారెడ్డి గారు మాట్లాడుతూ తాను గత 26 సంవత్సరాల నుండి మధుర చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకొని, పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు తన వంతు సహాయంగా నోటి పుస్తకాలు, స్టడీ మెటీరియల్స్, ప్లేట్లు, అందజేశారు. అలాగే క్రీడా సామాగ్రి మరియు ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు నగదు పారితోషకం తో పాటు, ప్రధమ శ్రేణి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి, బ్యాచ్ లను విద్యార్థులకు అందచేశారు.

ఆర్థికంగా పై చదువులు చదవలేని విద్యార్థిని విద్యార్థులకు తమ ట్రస్టు ద్వారా సహాయ సహకారాలు, విదేశీ చదువులు చదువుకునే వారికి ప్రోత్సాహకాలు అందిస్తూ, వారి భవిష్యత్తుకు బాటలు వేయడం జరిగింది అని రాగిడి లక్ష్మారెడ్డి తెలియజేశారు*

ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థిని విద్యార్థులకు సహాయ సహకారాలు అందించిన ఘనత మధుర చారిటబుల్ ట్రస్ట్ ది అని ఆయన తెలియజేశారు.

రాబోవు రోజుల్లో ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్లో గల ప్రభుత్వ పాఠశాలలో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేపడతామని రాగిడి లక్ష్మారెడ్డి తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, మధుర చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS