TEJA NEWS

వినాయక చవితి ఉత్సవాలు నేపథ్యంలో మేయర్ శ్రీమతి కోలన్ నీలా గోపాల్ రెడ్డి * అధ్యక్షతన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , కమిషనర్ సౌజన్య , ప్రజాప్రతినిధులతో కలిసి నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఈనెల 7న వినాయక చవితి సందర్భంగా కార్పొరేషన్ ఆయా డివిజన్ల పరిధిలో గణేష్ ఉత్సవ కమిటీల ఆద్వర్యాలలో నిర్వహించే నవరాత్రి వేడుకలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని,పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి విగ్రహాలను ప్రతిష్టించాలని,అదే విధంగా రానున్న రోజుల్లో భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో కార్పొరేషన్ ఆయా డివిజన్ల పరిధిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు.

మరియు వినాయక మండపాల వద్ద భద్రత,డ్రైనేజ్ వ్యవస్థ,వరద,మురుగు నీటి తరలింపు,విద్యుత్ తీగలు,చెట్ల కొమ్మలు,పురాతన సముదాయాల పట్ల జాగ్రత్త,దోమల వలన కలుగు డెంగ్యూ,మలేరియా వ్యాధుల పట్ల అవగాహన,ఎప్పటికప్పుడు పోలీసుల పర్యవేక్షణ,అదే విధంగా వినాయక నిమజ్జనం సమయంలో చెరువుల వద్ద క్రేన్ల ఏర్పాటు,ట్రాఫిక్ నియంత్రణ,మళ్లింపు చర్యలు,భక్తుల సౌకర్యం కొరకు ప్రత్యేక హెల్ప్ డెస్క్,త్రాగు నీరు,మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు,ఫస్ట్ ఎయిడ్ సెంటర్,చెరువులలో ఎప్పటికప్పుడు విగ్రహ వ్యర్థాల తొలగింపు చర్యలు వంటి అంశాలను తెలియజేస్తూ NMC అధికారులు,సిబ్బంది అనుసరించే విధి విధానాలను వివరించారు.ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రజాప్రతినిధులు,అధికారులు కృషి చేయాలని,అందుకు ఆయా గణేష్ ఉత్సవ కమిటీలు,ప్రజలు సహకరించాలని, ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవ వేడుకలు నిర్వహించుకోవాలని తెలుపుతూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సమావేశంలో కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు,ప్రజాప్రతినిధులు,సీనియర్ నాయకులు,యువ నాయకులు,ఆయా గణేష్ ఉత్సవ నిర్వాహకులు,NMC ఆయా విభాగాల అధికారులు,సివిల్ మరియు ట్రాఫిక్ పోలీస్ అధికారులు,ఇతర ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS