మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలు ఘనంగా…
పరవాడ మండలం 79 వార్డులో మెగాస్టార్ చిరంజీవి 69వ పుట్టినరోజు సందర్భంగా లంకెలపాలెంలో గత వారం రోజులుగా నిర్వహించిన మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలు నేటితో ముగిసాయి. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా లంకెలపాలెం జంక్షన్ లో కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు సోదరులు, పరవాడ మండల జనసేన పార్టీ ఇన్చార్జి ప్రసాద్ రావు ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ స్థాయి పేరు ప్రతిష్టలు పొందిన మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది ఘనంగా నిర్వహిస్తారని, అయితే లంకెలపాలెంలో పండుగలా వారం రోజులు చిరు జన్మదిన వేడుకలు నిర్వహించి వివిధ సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో గాజువాక బిజెపి పార్టీ ఇన్చార్జి కర్ణం రెడ్డి నర్సింగరావు, పెందుర్తి జనసేన నాయకురాలు గొన్న రమాదేవి, రావాడ సర్పంచ్ మోటూరు సన్యాసినాయుడు, రాష్ట్ర తూర్పు కాపు సంఘం అధ్యక్షులు ఆకుల అప్పలసూరి, గుటూరు శంకర్రావు, పి నాగేశ్వరరావు, 84 వ వార్డు కార్పొరేటర్ చిన తల్లి నీలబాబు, 85వ వార్డు కార్పొరేటర్ వరలక్ష్మి ప్రసాద్, మాజీ కార్పొరేటర్ దుల్ల లక్ష్మీ రామునాయుడు,బలిరెడ్డి అప్పారావు, మాజీ జెడ్పిటిసి బొద్దపు రమణ,బుగిడి గోవిందరావు,సర్వసిద్ధి సన్యాసిరావు, సుందరపు శ్రీనివాసరావు,మాజీ సర్పంచ్ బొడ్డపల్లి అప్పారావు, గొల్లవిల్లి శ్రీనివాసరావు, గొల్లవిల్లి నాగరాజు, గనిరెడ్డి కనకరాజు, మండల బిజెపి పార్టీ అధ్యక్షుడు పిల్లా సతీష్, బంతి కోరు గోవిందరాజు, గై పూరి భాస్కరరావు, దాసరి జయ, సేనాపతి రాజు,కన్నం రెడ్డి శ్రీనివాసరావు, మడక బాబ్జి, జెర్రిపోతుల గణేష్ కంటి మంత్రి శివ, తదితరులు పాల్గొన్నారు.
మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వారోత్సవాలు ఘనంగా…
Related Posts
ఇకనుంచి 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు: సీఎం చంద్రబాబు
TEJA NEWS ఇకనుంచి 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు: సీఎం చంద్రబాబు ఏపీలో పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త అందించారు. పెన్షన్ మొత్తాన్ని 3 నెలలకోసారి తీసుకోవచ్చని వెల్లడించారు. పెన్షన్ ఎవరు ఆపినా వెంటనే నిలదీయాలని…
డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామ కృష్ణంరాజు
TEJA NEWS డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామ కృష్ణంరాజును అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాసన సభ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామ కృష్ణం రాజు ని తోడ్కొని వెళ్లి స్పీకర్ స్థానం లో కూర్చోబెట్టిన ముఖ్యమంత్రి…