TEJA NEWS

ఎక్స్ గ్రేషియాను అందించిన మంత్రి పొంగులేటి

ఉమ్మడి ఖమ్మం

భారీ వర్షాలతో పోటెత్తిన వరదల్లో కొట్టుకునిపోయి మృతిచెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఐదు లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాను రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తో కలిసి అందజేశారు. కూసుమంచి మండలం నాయకన్ గూడెంలో వరదల్లో మృతిచెందిన షేక్ యాకుబ్, సైదాబీ దంపతుల కుటుంబాన్ని పరామర్శించి ఐదు లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా చెక్కులను వారి కుమారులు ఎస్కె. యూసుబ్, ఎస్కె. షరీఫ్ లకు అందజేశారు. మృతుల కుటుంబం కోరిక మేరకు కూసుమంచి లో ఇంటి స్థలం కేటాయిస్తామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం మృతుల కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటుందని మంత్రి తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి. శ్రీజ, ఖమ్మం ఆర్డీవో జి. గణేష్, కూసుమంచి మండల తహసీల్దార్ సురేష్, అధికారులు తదితరులు ఉన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS