TEJA NEWS

ఉప్పల్ నియోజకవర్గంలోని నాచారం డివిజన్లో ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి , అధికారులతో విస్తృత పర్యటనలో పాల్గొన్న మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి

కోటి 80 లక్షల రూపాయల వ్యయంతో పటేల్ కుంట చెరువు వద్ద నిర్మించిన సివరేజ్ డైవర్షన్ పైప్లైన్ పనులు పూర్తి అయినను ఉపయోగంలోకి తీసుకురాకపోవడంతో

ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి , మల్కాజిగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాగిడి లక్ష్మారెడ్డి మరియు నాచారం డివిజన్ కార్పొరేటర్ శాంతి సాయి జన శేఖర్ ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణ తో కలిసి పటేల్ కుంట చెరువును పర్యవేక్షించడం జరిగింది.
తక్షణమే సివరాజ్ డైవర్షన్ పైప్ లైన్ ను వాడుకలోకి తేవాలని ఆదేశించడం జరిగింది.
అలాగే చెరువు చుట్టూ బండు నిర్మించి వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకొరకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులకు సూచించడం జరిగింది.

అనంతరం చెరువులో పేరుకుపోయిన గుర్రపు డెక్క తొలగించేందుకు FTC యంత్రాన్ని ప్రారంభించడం జరిగింది.
అనంతరం ఎరుకల బస్తీలో చెరువుకు ఆనుకొని నిర్మించుకున్న ఇండ్లలోని వారు హైడ్రా వల్ల మా ఇల్లులు ఏమైనా పోతాయేమోనని భయపడుతుండటంతో వారికి భరోసా ఇచ్చి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది అంటూ ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది.

ఈ కార్యక్రమంలో గ్రేటర్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సాయి జన్ శేకర్ , ఇరిగేషన్ అధికారులు DE నరేందర్ AEE సుధీర్ మరియు స్థానిక బారాసా నాయకులు కార్యకర్తలు కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది


TEJA NEWS