TEJA NEWS

చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోరం,మల్లి బాబు

కామేపల్లి మండలం కొత్త లింగాల ధనలక్ష్మి ఫంక్షన్ హాల్ లో మండల ఎమ్మార్వో సిహెచ్ సుధాకర్ అధ్యక్షతన జరిగిన కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్ లబ్ధిదారులకు జరిగిన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ పాల్గొని చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కోరం కనకయ్య మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టో ప్రకారం ఆరు గ్యారంటీ పథకాలతో సహా రాష్ట్ర సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, దీనిలో భాగంగా ఈరోజు 14 మందికి కళ్యాణ లక్ష్మి, 122 మందికి ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు పంపిణీ చేయడం జరిగిందని, ఇంకా కొద్ది రోజులలో కొత్త రేషన్ కార్డులు, నూతన ఉద్యోగ నియామకాలు, ఇండ్లు లేని పేదలకు గృహ నిర్మాణాలను లాంటివి చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ గతంలో బి.ఆర్.ఎస్ ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితమైందని, రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలి అవినీతిమయం చేశారని, రాష్ట్ర ఖజానా ఖాళీ చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను సమర్ధంగా అమలు చేస్తోందని, రైతు రుణమాఫీ, స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యం, 200 యూనిట్లు లోపు ఉచిత కరెంటు ఇంకా ఎన్నో భవిష్యత్తులో పథకాలు అమలు చేస్తుందని, తెలంగాణ రాష్ట్ర ప్రజల నిజమైన బంగారు తెలంగాణ కల సాధ్యమవుతుందని మల్లి బాబు యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గింజల నర్సిరెడ్డి ఎండివో రవీందర్, ఎస్ కే ఫతే మహమ్మద్, ఏపూరి మహేందర్,దమ్మాలపాటి సత్యం, పుచ్చకాయల వీరభద్రం గబ్రు నాయక్, నల్లమోతు లక్ష్మయ్య, గుజ్జర్లపూడి రాంబాబు,
ధనియాకుల హనుమంతరావు, గోపిరెడ్డి, దేవుళ్ళ రామకృష్ణ గోపి చారి, బానోతు నరసింహ నాయక్,శీలం పుల్లయ్య జక్కంపూడి వెంకటేశ్వర్లు, మాలోత్ బావ్ సింగ్, మాలోత్ మోహన్ సత్తిబాబు అర్రెం రవి,దొడ్డ వేణు బట్టు రమేష్, మండల ఎస్సై సాయి, ఆ రైలు మండల అధికారులు ప్రజాప్రతినిధులు అధికారులు అనధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు

Print Friendly, PDF & Email

TEJA NEWS