పాతపట్నం మండలంలో గ్రామ సభల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంజీఆర్
ఊరు బాగుకోసం “గ్రామ సభ ” గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరు ఒక్కటిగా ఉండాలి.
15 వ ఆర్ధిక సంఘ నిధులను గ్రామాల అభివృద్ధికి వినియోగించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వ నారా చంద్రబాబునాయుడు మరియు ఉప-ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశానుసరం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రామసభలను పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో పాతపట్నం,కాగువాడ,గంగువాడ గ్రామ సచివాలయాలలో నిర్వహించబడిన గ్రామ సభల్లో నియోజకవర్గ శాసనసభ్యులు పాల్గొని ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రుల కృషి ఫలితంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రెండో విడతగా 15 వ ఆర్ధిక సంఘ నిధులు విడుదల చేసిందాన్నారు.
గ్రామ సభలు నిర్వహించకుండా గ్రామ పంచాయతీల బ్యాంకు ఖాతాలకు ఒక్క రూపాయ జమ చేయకుండా, ఆర్ధిక సంఘ నిధులను గత ప్రభుత్వం పక్కదారి పట్టించిందని గత వైసిపి ప్రభుత్వం పై ఆగ్రహావేశాలు వ్యక్తం చేసారు. 2024-2025 ఆర్ధిక సంవత్సరంలో ప్రణాళిక భద్ధంగా గ్రామాలు అభివృద్ధికి కృషిచేయాలన్నారు.MGNREGS నిధులతో చేపట్టవలసిన పనులను,ప్రాధాన్యత క్రమంలో స్థానిక అవసరాల మేరకు అధికారులుతో చర్చించి గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడేలా వినియోగించాలని ఉపాధి హామీ వేతన దారుల యొక్క వేతనాల కోసం అధికారులతో చర్చించి ప్రజలల్లో అవగాహన కల్పిస్తూ ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందారావు మరియు గ్రామ ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గున్నారు.