TEJA NEWS

స్వర్ణ గ్రామాలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయం – ఎమ్మెల్యే నరేంద్ర వర్మ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ బాధ్యత వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా బాపట్ల మండలం కంకటపాలెం గ్రామంలో బాపట్ల శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు గ్రామ సభ కార్యక్రమంలో పాల్గొని గ్రామాల్లో సమస్యలు పరిష్కరించి స్వర్ణ గ్రామాలు అభివృద్ధి చేయడమే ప్రభుత్వం ధ్యేయమని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ సంబంధింత అధికారులకు సమస్యలను పరిష్కరించాలని ఆదేశించిన బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేశన నరేంద్ర వర్మ రాజు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు మాట్లాడుతూ :-

చెక్ పవర్ వున్న ఏకైక నాయకుడు సర్పంచ్ అని అన్నారు

గత వైసిపి ప్రభుత్వం సర్పంచ్ లను కేవలం ఉత్సవ విగ్రహాలు గా చూసిందన్నారు.

సంపద సృష్టించి అభివృద్ధి చేయటం నారా చంద్రబాబు నాయుడు కే సాధ్యం అని అన్నారు

రాష్ట్రవ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలు..

•దేశంలోనే మొదటిసారి భారీ స్థాయిలో ఒకే రోజు గ్రామ సభల నిర్వహణ
•ఉపాధి హామీ పథకం ద్వారా రూ.4,500 కోట్ల నిధులతో, 87 రకాల పనులకు ఆమోదం

  • 9 కోట్ల పని దినాలు, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పన
  • స్వయంసమృద్ధితో పంచాయతీలు కళకళలాడాలి
  • గ్రామాలకు ఆదాయం, అభివృద్ధి పెంచేలా ప్రణాళిక
    • పంచాయతీల పునరుజ్జీవానికి నలుదిశలా విప్లవం
    • గ్రామ ప్రత్యేకతలకు బ్రాండ్ రావాలన్నదే మా ప్రభుత్వ ఉద్దేశం
    • సోషల్ ఆడిట్ పకడ్బందీగా చేపడతాము

‘ఎన్నికల ప్రచార సమయంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు పారదర్శక, జవాబుదారీతనంతో కూడిన పాలన అందిస్తామని మాటిచ్చాం. దాని ప్రకారమే పంచాయతీలు సుసంపన్నం కావాలనే సుదూర లక్ష్యంతో ప్రణాళిక ప్రకారం ముందడుగు వేస్తున్నాము.. దేశంలోనే మొదటిసారిగా రాష్ట్రంలోని 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభలను నిర్వహించి, గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఆయా గ్రామ పంచాయతీల్లో ప్రజలంతా కలిసి తీర్మానాలు చేయనున్నారని తెలియజేశారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పనుల్లో భాగంగా రూ.4,500 కోట్ల నిధులతో, 87 రకాల పనులను గ్రామాల్లో చేయనున్నామన్నారు. దీనిద్వారా మొత్తం 9 కోట్ల పనిదినాలు, 54 లక్షల కుటుంబాలకు ఉపాధి కల్పించే బృహత్తర ప్రణాళిక అమలు చేస్తామని పేర్కొన్నారు. ఈ నెల 23వ తేదీన దేశంలో ఎన్నడూ లేనట్లుగా ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ శాఖలైన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల సంయుక్త ఆధ్వర్యంలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో గ్రామాల్లో చేయాల్సిన పనులపై చర్చిచేందుకు మొత్తం 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలను నిర్వహిస్తున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


TEJA NEWS