స్వయంభూ శ్రీ వేణుగోపాల స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

TEJA NEWS

MLA Vasantha Krishnaprasad visited Swayambhu Sri Venugopala Swami

స్వయంభూ శ్రీ వేణుగోపాల స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ .

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన గంపలగూడెం మండలం నెమలి గ్రామంలో వేంచేసియున్న స్వయంభూ శ్రీ వేణుగోపాలస్వామి వారిని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి పవళింపు సేవలో పాల్గొన్నారు. అనంతరం తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ముందుగా ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కి, ఆయన సతీమణి శిరీష కి ఘనంగా స్వాగతం పలికారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే కృష్ణప్రసాదు ఆకాంక్షించారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS

You cannot copy content of this page