TEJA NEWS

అశ్వారావుపేట నియోజకవర్గం లో ఎంపీ రఘురాం రెడ్డి పర్యటన*

జిల్లా ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తో కలిసి చండ్రుగొండ మండలంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు అశ్వారావుపేటలో చెక్కులను అందజేస్తారు. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన పేదలకు ప్రభుత్వం మంజూరు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కులతో లబ్ధి చేకూర్చనున్నారు. ఆ తర్వాత ఎంపీ రఘురాం రెడ్డి ఖమ్మంలోని తన నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులకు అందుబాటులో ఉంటారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS