TEJA NEWS

ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం
-రాజమహేంద్రి మహిళా జూనియర్, డిగ్రీ & పీ.జీ. కళాశాలలో ఘనంగా జరిగిన జాతీయ క్రీడా దినోత్సవం
రాజమహేంద్రవరం,
గురువారం నాడు స్థానిక గోకవరం బస్టాండ్ వద్ద ఉన్న రాజమహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ మరియు పీజీ కళాశాలలో జాతీయ క్రీడ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రి మహిళా కళాశాలలో చదువుతున్న ఇంటర్మీడియట్ సీఈసీ ఇంగ్లీష్ మీడియం విద్యార్థిని కుమారి పొక్కునూరి లక్ష్మీ వల్లి సాయి సంజనను కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ టి.కే. విశ్వేశ్వర రెడ్డి మరియు ప్రిన్సిపాల్ శ్రీమతి తేతలి సత్య సౌందర్యలు శాలువా కప్పి మెమెంటో ఇచ్చి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటేరియన్ కరస్పాండెంట్ డాక్టర్ పీకే విశ్వేశ్వర రెడ్డి మాట్లాడుతూ మన భారతదేశం ప్రపంచంలోనే అతి ఎక్కువగా జనాభా ఉన్న దేశం అయినా సరే ఇటీవల పారిస్ లో జరిగిన ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించకపోవడం మన దురదృష్టం అని రాజమండ్రి చుట్టుపక్కల ఏడు లక్షల మంది జనాభా ఉన్న వారికి ఆడుకోవడానికి సరైన క్రీడా మైదానాలు లేవు అని నేటి రోజులలో గవర్నమెంట్ స్కూలులో పనిచేస్తున్న పి ఈ టి లు పిల్లలకు ఆటలు నేర్పడం కాకుండా వారిని లైనులలో పంపే ఒక వాచ్మెన్ లా పనిచేస్తున్నారు

అని తూర్పుగోదావరి జిల్లాలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ ఉన్నా సరే దానిలో ఇద్దరు కోచ్ లు మాత్రమే ఉండడం దురదృష్టకరమని ప్రతి గవర్నమెంటు మరియు ప్రైవేటు స్కూలుల లో ఉన్న విద్యార్థులకు నెలకు ఏదో ఒక క్రీడా పోటీలు నిర్వహిస్తే తన వంతు సహాయంగా వారికి ప్రయోజనాలు ఇతర సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని విశ్వేశ్వర రెడ్డి తెలిపారు.
సంజన జిల్లా స్థాయి బ్యాట్మెంటన్ పోటీలలో పాల్గొని మంచి ప్రతిభను కనపరుస్తుందని ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి తేతలి సత్య సౌందర్య అన్నారు.రాష్ట్రస్థాయిలో కూడా ప్రతిభ పరచాలని ఆకాంక్షించారు.
బ్యాట్మెంటన్ క్రీడాకారిణి సంజన మాట్లాడుతూ మా రాజమహేంద్రి మహిళా కళాశాలలో చదువుతోపాటు క్రీడలకు సమాన ప్రాధాన్యం ఇవ్వడం చాలా ఆనందకరం అని తను ఎంచుకున్న బ్యాట్మెంటన్ క్రీడలో ఇంకా మంచి ప్రతిభ కనబరిచి ముందడుగు వేసి తన కళాశాలకు మరియు రాజమహేంద్రవరం నగరానికి మంచి పేరు తీసుకుని వస్తాను అని తెలియజేసింది.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు మరియు ఎన్.ఎస్.ఎస్. పి.ఓ.లు ఎం.కే.ఎస్. ప్రసాద్ దంటు వీర వెంకట్రావు ఎన్.ఎస్.ఎస్. క్లర్క్ కే. సుధారాణి, విద్యార్థులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

TEJA NEWS