TEJA NEWS

నిజామాబాద్ జిల్లా కేంద్రంగా గంజాయి స్మగ్లింగ్

నిజామాబాద్ జిల్లా
నిజామాబాద్ జిల్లా కేంద్రం లో ఖిల్లా రోడ్డు చౌరస్తాలో గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి 455 గ్రాముల ఎండు గంజాయిని పట్టుకున్నట్లు ప్రొహిబిషన్ ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ దిలీప్ తెలిపారు.

ఈ మేరకు నిజామాబాద్ డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు ఉదయం ఖిల్లా చౌరస్తాలో ఎండు గంజాయి ని సరఫరా చేస్తున్న షేక్ సమాద్ అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని వద్ద 455 గ్రాముల ఎండు గంజాయి పట్టుకొని టీవీఎస్ ఎక్సెల్ మోపెడ్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

ఈ దాడులలో ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ దిలీప్, ఎస్ఐ మల్లేష్, సిబ్బంది, షబిరు ద్దీన్, ప్రభాకర్, సంజయ్, దరి సింగ్, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భం గా ఎస్ హెచ్ ఓ దిలీప్ మాట్లాడుతూ..

ప్రభుత్వ ఆదేశాల మేరకు డ్రగ్స్ రైతా నిజామాబాద్ జిల్లాగా మార్చుట లో భాగంగా ఎవరైనా గంజాయి కానీ మరి ఇతర మత్తు పదార్థాలు కలిగి ఉన్న అమ్మిన చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామ న్నారు.

ఎవరికైనా అట్టి సమాచారం తెలిస్తే ఎక్సైజ్ ఎస్ హెచ్ ఓ 8712658973 నంబర్ కు సమాచారం అందించాలని వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.


TEJA NEWS